కోదాడ తమరబండపాలెం లో ఉచిత మెగా వైద్య శిబిరం :
ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ వారి ద్వారా ఇమ్మానుయేలు మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జవ్వాజి.జెస్సి కుమార్ పాములపహాడ్ వారి ఆధ్వర్యంలో తమ్మరలోని న్యూ లైఫ్ చర్చ్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి వైద్య శిబిరంలో 300 మందికి ఉచితంగా వైద్యంఎటువంటి డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు లేకుండా రక్త పరీక్షలు, బిపి , షుగర్, ఎక్స్-రే, ఇ సి జి, కంటి పరీక్షలు అద్దాలు పంపిణీ చేయడం జరిగింది అని మెడికల్ క్యాంపు టీమ్ లీడర్ జంగా జయరాజు తెలిపారు.
మెడికల్ క్యాంపులో ఎక్సరే ఈసీజీ, పంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. డాక్టర్స్ :- స్నేహ లత, భారత్, అజయ్, మనోజ్ఞ , సంపత్ ఆశ్రయం పారామెడికల్ స్టాఫ్ ల్యాబ్ టెక్నీషియన్స్ :- కుసుమ ఫార్మసీ : స్వామి, సమూయేలు, నరసింహ,ఎక్సరే : శిరీష్, రవి, సుబ్రహ్మణ్యం న్యూ లైఫ్ అపోస్టాలిక్ చర్చి వ్యవస్థాపకులు పాస్టర్ కె.శ్యామ్ సుందర్ గ్రామ పెద్దలు తదితరులుపాల్గొన్నారు.