గ్రూప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి.ఎమ్.సంతోష్

Nov 13, 2024 - 19:07
 0  5
గ్రూప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి.ఎమ్.సంతోష్

గద్వాల నవంబర్ 13 : నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. ఎం.సంతోష్ అన్నారు. బుధవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ యం. మహేందర్ రెడ్డి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని దశల్లో ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు పటిష్టంగా చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను శాఖాధికారి, సంబంధిత పరీక్షా కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్ తో సమన్వయం చేసుకొని, ఒక రోజు ముందస్తుగా పూర్తి చేయాలన్నారు. త్రాగునీటి వసతి, పారిశుద్ధ్య పనులు చేయాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ కు తప్ప మరెవ్వరికి పరీక్షా కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్ అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్, పుస్తకాలు, అనుమతి లేని సామాగ్రిని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి, కేంద్రంలోకి రాకుండా చూడాలన్నారు. పరీక్షా విధుల సిబ్బంది, అధికారులు కేంద్రానికి ముందస్తుగా చేరుకొని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 8570 మంది అభ్యర్థులు గ్రూప్-3 పరీక్షలు వ్రాయనున్నారని, 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, పరీక్షా కేంద్రాల్లో నిబంధనల మేరకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షల విజయవంతానికి కమీషన్ ఆదేశాలు, సూచనల ప్రకారం అన్ని చర్యలు చేపట్టనునట్లు  కలెక్టర్ అన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందు హాజరుకావాలని ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షాలలోకి అనుమతించ కూడదని అన్నారు. హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు కచ్చితంగా తీసుకొని రావాలన్నారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ నర్సింగ రావు, రీజినల్ కో - ఆర్డినేటర్ రామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333