బదిలీపై వెళ్తున్న రైటర్ బజార్ కి ఘన సన్మానం..
సూర్యాపేట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించి బుధవారం బదిలీపై చివ్వేంల పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న రైటర్ బజార్ కి తోటి సిబ్బంది ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు.సహోద్యోగులు మాట్లాడుతూ, బదిలీపై వెళ్తున్న సిబ్బంది తమ సేవాకాలంలో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి స్టేషన్‌కు మంచి పేరు తీసుకొచ్చారని కొనియాడారు. వారు కొత్త విధి స్థానంలో కూడా ఇదే సేవా తత్వంతో ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.బదిలీపై వెళ్తున్న బజార్ తమతో కలిసి పనిచేసిన అధికారులకు, సహచర సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ స్టేషన్‌లో పనిచేసిన రోజులు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏ ఎస్ఐ లు,రైటర్ లు వీరయ్య, శ్రీను,ఐడి పార్టీ శ్రీరాములు,మహిళ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.