ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని.  కోరుతూ.. విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం

Jun 22, 2026 - 19:22
 0  0
ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని.  కోరుతూ.. విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం

 ఫీజు నియంత్రణ చట్టం తీసుకువచ్చి కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థల దోపిడిని అరికట్టాలని కోరుతూ తెలంగాణ విద్యార్థి  జన సమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మ గాని వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో నేడు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వినయ్ గౌడు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలు విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను  దోపిడీ చేస్తున్నాయి అన్నారు. విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాము అనిపదేపదే హామీలు ఇస్తున్నప్పటికీ, అవి కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నవి అని విమర్శించారు. రాష్ట్రంలోని మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం రోజురోజుకూ భారంగా మారుతోంది . ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా  లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ వారిపై కఠిన చర్యలు లేకపోవడం దురదృష్టకరo ప్రభుత్వం ప్ర ఫీజు నియంత్రణ చర్యలు లేక  పేద వర్గాలకు మంచి జరిగే విధంగా నాణ్యమైన విద్య  అందించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. . అధిక ఫీజుల భారం వల్ల వేలాది మంది తల్లిదండ్రులు అప్పుల పాలవుతుండగా, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంలు, హాస్టల్ మరియు ఇతర పేర్లతో భారీగా డబ్బులు వసూలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నవి రాష్ట్రంలో , అధిక ఫీజులు వసూలు చేస్తున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని  రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి జన సమితి నాయకులు దినేష్ నాయక్. ఈశ్వర్ సింగ్. వరుణ్. హర్ష రింగు. మహేష్. సాయి తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333