ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు ..

Sep 21, 2024 - 14:36
Sep 21, 2024 - 16:27
 0  22
ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై  కఠిన చర్యలు ..

 

ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు.

తెలంగాణ వార్త సూర్యాపేట జిల్లా ప్రతినిధి..

ప్రభుత్వ భూమిని అక్రమంగా బంధువుల పేర్లపై బదిలీ చేసిన కంప్యూటర్ ఆపరేటర్....

  కంప్యూటర్ ఆపరేటర్ వత్సవాయి జగదీష్ ను ఉద్యోగం నుండి తొలగింపు....

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్...

హుజూర్నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బూరుగడ్డ గ్రామ ప్రభుత్వ భూమిని అక్రమంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు బదిలీ చేసిన వత్సవాయి జగదీష్ ను టర్మినేట్ చేసినట్లుగా కలెక్టర్ తెజస్ నందలాల్ పవార్ తెలిపారు. హుజూర్నగర్ మండలంలోని ప్రభుత్వ భూముల వివరాలను పరిశీలీస్తున్న కలెక్టర్కు వచ్చిన అనుమానంతో హుజూర్నగర్, బూరుగడ్డ రెవెన్యూ రికార్డులను పరిశీలించాల్సిందిగా ఆర్డీవోకు శ్రీనివాసులకు కలెక్టర్ ఆదేశించారు. హుజూర్నగర్ ,బూరుగడ్డ గ్రామాలలోని సర్వేనెంబర్లు 439, 604 ,602 ,608, 1041, 1041, గల భూమిలో ఉన్న ప్రభుత్వ భూమిని కంప్యూటర్ ఆపరేటర్ తన బంధువుల పేర్లపై మార్పిడి చేసినట్టుగా గుర్తించడం జరిగింది. వాటి యొక్క వివరాలు... బురుగుగడ్డ గ్రామములోని సర్వే నంబరు 439 /55/5 లో విస్తీర్ణము 8.38 కు॥ పచ్చిపాల ప్రియాంక పేరు మీద,604/116 లో 7.32 కు.. పచ్చిపాల ప్రియాంక, 604 /58 లో 4.38 కుంటలు మడిపల్లి స్వప్న సోదరి పేరు మీద హుజూర్నగర్ లోని 602/122/1 లో 0.01 వత్సవాయి ఇందిరా తల్లి పేరు పైన 608/16 లో 8.0 ఎ॥ వత్సవాయి ఇందిర తల్లి పేరు మీద 10 41/144 లో 6.25 వత్సవాయి ఇందిర తల్లి పేరు మీద 10 41/368/3/2/5 0.10 వత్సవాయి ఇందిర తల్లి పేరు మీద మొత్తం 36 ఎకరాల 23 గుంటల భూమిని నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పోర్టల్లో నమోదు చేసినట్లు విచారణలో తేలింది, ఇట్టి అనధికారిక ఆన్లైన్ నమోదులు వత్సవాయి జగదీష్ కంప్యూటర్ ఆపరేటర్ హుజూర్నగర్ తాసిల్దార్ కార్యాలయం నందు పని చేయుచూ, నవంబర్ 2019 నుండి ఫిబ్రవరి 2020 మధ్య కాలంలో తమ బంధువుల పేరుపై మార్పిడి చేసినట్లుగా గుర్తించడం జరిగింది అప్పటి తాసిల్దార్ ఇతర అధికారులపై కూడా సూక్ష్మ విచారణ జరపవలసిందిగా జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత ను విచారణ అధికారిగా నియమించినట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేర్కొన్నారు. 36 ఎకరాల 23 కుంటల ప్రభుత్వ భూమిని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కంప్యూటర్ ఆపరేటర్ తన రక్త సంబందికులకు ఉద్దేశపూర్వకంగా మోసపూరితంగా అక్రమంగా బదిలీ చేయుట ద్వారా ప్రభుత్వమునకు చాలా నష్టం జరిగినట్లుగా గుర్తించడమైనది. పైన చూపిన భూములను నిషేధిత జాబితాలో చేర్చుటకు అలాగే ఈ భూమిపై లావాదేవీలను పరిశీలించి పూర్తి చర్యలు తీసుకోనున్నట్లు అలాగే జిల్లాలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని ప్రభుత్వ భూముల రక్షణ కు అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంధలాల్ పవార్ తెలిపారు. అప్పటి కాలంలో ఉన్న అధికారులపై కూడా సూక్ష్మ విచారణ జరిపి త్వరలో కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద లాల్ తెలిపారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223