వ్యవసాయ కార్మికులకు 12 వేల ఆర్థిక సహాయం అందించాలి

Aug 12, 2024 - 20:08
Aug 12, 2024 - 20:35
 0  13
వ్యవసాయ కార్మికులకు 12 వేల ఆర్థిక సహాయం అందించాలి

వ్యవసాయ కార్మికులకు 12 వేల ఆర్థిక సహాయం అందించాలి...

 వ్య.కా.సం. నేత ధనుంజయ నాయుడు డిమాండ్

 వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పణ

తెలంగాణ వార్త సూర్యాపేట జిల్లా ప్రతినిధి:- గత నవంబర్ లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రెమిడాల రాజు ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

 సోమవారం నాడు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన అనంతరంవారు మాట్లాడుతూ...

 భూమిలేని వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తావని నేటి ముఖ్యమంత్రి నాటి ఎన్నికల సభలో హామీ ఇచ్చి ఉన్నారని, ఇండ్లు లేని వ్యవసాయ కార్మికులను గుర్తించి ఇళ్ల స్థలంతో పాటు ఇంటి నిర్మాణ కొరకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారని, గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డుకు నోచుకోడి నిరుపేదలను గుర్తించి కార్డులు ఇస్తామని, మునిసిపల్ కేంద్రాల్లోనూ మరియు కార్పొరేషన్లలోను ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తామని అనేక హామీలు ఇచ్చి ఉన్నందున వాటి అమలుకై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని అలాగే పెండింగులో ఉన్న ఉపాధి హామీ కూలీల బిల్లులు వెంటనే విడుదల చేయాలని వారుడిమాండ్ చేశారు.

 కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తి వేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నదని, ప్రతి బడ్జెట్లో నిధులు కోత విధిస్తూ, పథకాలు ఎత్తి వేసేందుకు అనేక కొర్రీలుపెడుతూ.... రాక్షస ఆనందం పొందుతున్నదని, సంవత్సరానికి ₹200 రోజులు పని కల్పించి రోజుకు 700 రూపాయలు వేతనంఇవ్వాలని అందుకు తగు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు

 కార్యక్రమములో జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం, జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యుడు బూర వెంకటేశ్వర్లు, మీసాల శీను రడపగ మహేష్ ఎడ్ల సైదులు, సత్యవతి వెంకటమ్మ ఆర్ సత్యం పాల్గొన్నారు

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223