ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్

Nov 2, 2024 - 21:04
Nov 3, 2024 - 15:46
 0  90
ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్

అడ్డగూడూరు 2 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-  యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు.సన్నా వడ్లకు 500 రూపాయల బోనసును రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని అమ్ముకోవాలి దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దు ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరను కల్పిస్తుంది ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోలేబోయిన లింగయ్య యాదవ్, టిపిసిసి రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి, పిఎసిఎస్ చైర్మన్ కోప్పల నిరంజన్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ చెడే చంద్రయ్య, మండల కాంగ్రెస్ నాయకులు రమేష్ ,బాలెoల సాగర్,బాలెoల సైదులు, మహిళా సంఘం నాయకురాలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.