వినాయకుని లడ్డూను కైవసం చేసుకున్న మైనారిటీ యువకుడు
జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల టౌన్:- పట్టణం రాఘవేంద్ర కాలనీలో శివసేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్గర 11 రోజులు పూజలు అందుకున్న వినాయక స్వామి ప్రసాదం లడ్డు ను రాఘవేంద్ర కాలనీకి చెందిన మైనారిటీ యువకుడు మహమ్మద్ షఫి లడ్డూ వేలం పాటలో పాల్గొని 39900 రూపాయలకు లడ్డూను కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వినాయక స్వామి దగ్గర ప్రతిష్టించిన కలశంను తెలుగు కృష్ణ కుమారుడు కిషోర్ 7777 రూపాయలకు వేలం పాట లో పాల్గొని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీరామలింగేశ్వర కాంళ్లే మాట్లాడుతూ రాఘవేంద్ర కాలనీలో శివసేన యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గజానన మహోత్సవాలలో కుల మతాలకతీతంగా హిందూ ముస్లిం భాయి భాయ్ అన్న పదానికి నిదర్శనంగా అందరూ కలిసి మెలిసి స్వామివారి ఉత్సవాలు నిర్వహించడం చాలా శుభ సందర్భం ఈ సందర్భంగా లడ్డు వేలం పాటలో స్వామివారి ప్రసాదం లడ్డూను ముస్లిం యువకుడైన మహమ్మద్ షఫీ కైవసం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని ఇదే విధంగా కులమతాలకు అతీతంగా కలిసి మెలిసి ఉంటూ ముందుకు సాగాలని తెలియజేశారు.అనంతరం వినాయక నవరాత్రులలో నిర్వహించిన మహిళలకు పిల్లలకు ఆట పోటీలలో గెలుపొందిన విన్నర్లకు బహుమతులు అందజేయడం జరిగింది.