పోలీస్ పెట్రోల్ బంక్‌లో ఉద్యోగాల భర్తీ.

Jul 2, 2026 - 19:54
 0  1
పోలీస్ పెట్రోల్ బంక్‌లో ఉద్యోగాల భర్తీ.

➤ బాయ్స్, గర్ల్స్‌కు ఉపాధి అవకాశం

➤ ఆకర్షణీయమైన వేతనంతో వెంటనే నియామకాలు

 జోగులాంబ గద్వాల 2 జూలై తెలంగాణ వార్త ప్రతినిధి : జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలోని పోలీస్ పెట్రోల్ బంక్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పోలీస్ పెట్రోల్ బంక్‌లో పనిచేయుటకు బాయ్స్ మరియు గర్ల్స్ కు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 

పెట్రోల్ బంక్ సిబ్బందిగా పనిచేయాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే సంప్రదించవచ్చు. ఎంపికైన వారికి నెలకు ఆకర్షణీయమైన వేతనం అందించబడుతుంది. క్రమశిక్షణ, బాధ్యతతో పనిచేసే అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని ఏ.ఆర్. హెడ్‌క్వార్టర్స్‌లో ఎమ్.టి. సెక్షన్ ఆర్.ఐ. వెంకటేష్ ని సంప్రదించాల్సిందిగా పేర్కొన్నారు.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 8712670281 పి ఆర్ ఓ ఆఫీస్ నుంచి తెలియజేశారు.

.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333