ఉపాధ్యాయులు సమయ వేళలు పాటించాలి ఎంఈఓ
జోగులాంబ గద్వాల 19 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-కేటి దొడ్డి ఉపాధ్యాయులు సమయ వేళలో పాటించి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని కేటీ దొడ్డి మండల విద్యాధికారి వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం మండల పరిధిలోని సోంపురం ఎర్సన్ దొడ్డి ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాలలను, చింతలకుంట జడ్పీ హైస్కూల్, కేటీ దొడ్డి కేజీబీవీ పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు హాజరు రిజిస్టర్ పరిశీలించారు. అలాగే విద్యార్థుల మధ్యాహ్న భోజన పరిస్థితి, వంటగదులు, స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించేందుకు వంట ఏజెన్సీ వారు తగు శ్రద్ధ వహించాలన్నారు. ఉపాధ్యాయులు హెడ్మాస్టర్ వంటను పరిశీలించి విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు వేడలు పాటించి విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని ఎంఎఓ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల హెడ్మాస్టర్, ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు