పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్స్ వెంటనే విడుదల చేయాలి!
అడ్డగూడూరు 01 జూలై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని ధర్మారం గ్రామంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ నివాసంలో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ , ఫీజు రీయింబర్సుమెంట్ నిధులు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన వినతి పత్రం అందజేయడం జరిగింది.అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న7 వేల పైచిలుకు కోట్లు స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలనీ, నిధులు ఇవ్వకపోవడం ద్వారా విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ కోర్సు పూర్తి చేసిన కూడా వారి సర్టిఫికెట్లు కళాశాల యాజమాన్యాలు ఇవ్వడం లేదు. ఉన్నత చదువులకు మరియు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారికి ఇబ్బందికరంగా మారింది. కావున ఇట్టి విషయంలో మీరు విద్యార్థులకు న్యాయం చేసే విధంగా కృషి చేయగలరని కోరుతున్నాము అని అన్నారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం అసెంబ్లీలో మాట్లాడుతానని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు విడుదల అయ్యేవిధంగా చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సిహెచ్ వంశీ, కళ్యాణ్, వినయ్ లక్ష్మి నివాస్ ,ఎస్ ఎస్ యు నాయకులు శివరాజ్, రాకేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.