పీసా గ్రామసభల ద్వారా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక చేయాలి

Nov 14, 2024 - 22:04
Nov 15, 2024 - 16:27
 0  25
పీసా గ్రామసభల ద్వారా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక చేయాలి

పీసా గ్రామసభల ద్వారా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక చేయాలి....

తాసిల్దారుకి వినతి పత్రం :జిఎస్పి రాష్ట్ర కార్యదర్శిపూనెం సాయి......

వాజేడు ప్రతినిధి (తెలంగాణ వార్త ):- గురువారం ఏజెన్సీ ప్రాంతంలో ఇందిరమ్మ కమిటీలు రాజ్యాంగంలో పొందుపరిచిన ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంఅన్నారు.పీసా గ్రామ సభ ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగాలని వాజేడు తాసిల్దారుకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి మాట్లాడుతూ ఆర్టికల్ 342 ప్రకారంగా 1/70చట్టానికి అనుకూలంగా ఏజెన్సీ ప్రాంతంలో పీసా గ్రామసభల ద్వారా ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో పూర్తి హక్కులు పీసా గ్రామ సభలకు ఉంటుందని ఆయన అన్నారు.ఎంపిక ప్రక్రియ లో కీలక పాత్ర పీసా గ్రామ సభలకె ఇవ్వాలని భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఏజెన్సీ చట్టాలను పట్టించుకోకుండా ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా ఇందిరమ్మ ఇండ్లు గిరిజనేతరులకు ప్రకటిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమనిఅన్నారు.ఆదివాసి చట్టాలను గౌరవించవలసిందేనని ఉన్నారు గత ప్రభుత్వం కూడా డబల్ బెడ్ రూములు తమ పార్టీ కార్యకర్తలకె ప్రకటించారని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే అడుగుజాడల్లో నడుస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 5వ షెడ్యూల్ భూభాగంలో పీసా 1/70 చట్టాలను అమలు చేసే బాధిత అధికారులపై ఉందని ఆ చట్టాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఏజెన్సీ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లు పీసా గ్రామ సభల ద్వారా నిరుపేద ఆదివాసీలకే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. పేసా గ్రామ సభలు పెట్టి గ్రామ సభలో 1/70చట్టం, పేసా చట్టాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. పేసా చట్టం, అటవీ హక్కులచట్టం పై శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ సభ అంశాలు ఆన్లైన్ లో నమోదు చేసే విదంగా చుడాలని అన్నారు.ఈ సమావేశంలో బోధిబోయిన సురేష్ రాజు తదితరులు ఉన్నారు