పాటశాలలో మద్యాహ్నం భోజనం తిని 14 మంది విద్యార్థులకు అస్వస్థత
వాటర్ ట్యాంక్ శుభ్రం చేయడం లేదని గ్రామస్థుల ఆగ్రహం
జోగులాంబ గద్వాల 20 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం రేకులపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మద్యాహ్నం భోజనం తిన్న తర్వాత 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంగా రేకులపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను విద్యార్థిని విద్యార్థులను పరామర్శించిన జిల్లా చైర్మన్ సరిత. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విద్యార్థులకు వైద్యం అందించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని, అందరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. గ్రామాలలో త్రాగునీటి ట్యాంక్ లు అపరిశుభ్రతంగా ఉండటంతో ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్తుల ఆరోపణలు. ఇప్పటికైనా సంబంధం అధికారులు పర్యవేక్షణ చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.