పల్లెలపై విషం చిమ్ముతున్న SNS కంపెని
జోగులాంబ గద్వాల్11 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఎర్రవల్లి మండలం జింకలపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ఎస్ఎన్ఎస్ కంపెనీ నాలుగైదు గ్రామాల ప్రజలకు,మూగజీవాలకు ప్రాణాంతకంగా మారింది.
కంపెనినుండి వెలువడే విష రసాయనాలను ద్వసంచేయకుండా పంటపొలాలపై వదులుతున్నారు.
పంటపొలాలనుండి షేక్ పల్లి వాగులోకి ఆపై కృష్ణానదిలోకి విష రసాయనాలను వదులుతున్నారు.
కంపెనీనుండి వెలువడే విషరసాయనాలు భూమిలోకి చొచ్చుకెళ్ళి భూగర్భజలాలను విషపూరితం చేస్తున్నాయి.
షేక్ పల్లి వాగు పూర్తిగా విషమయం అయింది.
ఈ నీటిని తాగిన మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయి.
కంపెనీ విషరసాయనాలవల్ల వాతావరణ కాలుష్యం కూడా తీవ్రంగా ఉంది.
తలుపులు మూసుకున్నా భరించరాని దుర్గంధం వెలువడుతుంది.
దీనివల్ల ప్రజలు శ్వాసకోశ వ్యాదులకు గురవుతున్నారు.
ఎన్నో ఏళ్ళుగా ప్రజలు మొత్తుకుంటున్నా యాజమాన్యం పట్టించుకోవడంలేదు.
ప్రజల రోదన అరణ్యరోదనగా మారింది.
చాలాసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా తాత్కాలిక ఉపశమనం లభించిందిగానీ,శాశ్వత పరిష్కారం లభించలేదు.
తాము సొమ్ము చేసుకోవడానికి కంపెని యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది.
అడగడానికి వెళ్ళినవారిని లోపలికి అనుమతించడంలేదు.
పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు.
సరైన అనుమతులు లేకుండా కంపెనీని నడుపుతున్న యాజమాన్యంపై చర్యతీసుకోవాలని అధికారులను కోరుతున్నాం.
పల్లెలపై విషపు పంజా విసురుతున్న ఎస్ఎన్ఎస్ కంపెనీని మూసివేయాలి.
లేదా శాశ్వత నష్ట నివారణ చర్యలు చేపట్టాలి.
సమస్యను పరిష్కరించకపోతే కంపెనీని మూసేవరకు ఆంధోళన చెపడుతామని హెచ్చరిస్తున్నాం అని మండలం ప్రజల అంటున్నారు.