పద్మా నగర్ జంక్షన్ వద్ద అండర్ పాస్ నిర్మించాలి, బద్దం నాగరాజు గౌడ్,
నకిరేకల్ పద్మా నగర్ జంక్షన్ వద్ద వెంటనే అండర్పాస్ నిర్మించాలి, వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ నల్గొండ జిల్లా వైస్ చైర్మన్ బద్దం నాగరాజుగౌడ్
ప్రమాదకరంగా మారిన పద్మనగర్ జంక్షన్
ఇప్పటివరకు పూర్తికాని సర్వీస్ రోడ్లు
నల్గొండ జిల్లా, నకిరేకల్, హైవే నుంచి పద్మా నగర్ జంక్షన్ వద్ద అండర్ పాస్ ను వెంటనే నిర్మించాలి అలాగే రోడ్డు వెంట విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి నకిరేకల్ పట్టణం నుంచి జాతీయ రహదారి వైపు రావడానికి . రహదారి నుంచి మళ్లీ నకిరేకల్ పట్టణంలోకి వెళ్లడానికి ఈ ప్రధాన జంక్షన్ వద్ద అండర్పాస్ వాంతన లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతూన్నారు, ఈ జంక్షన్ పక్కనే పద్మా నగర్ ఉండడంతో కాలనీవాసులు రాత్రి వేళలో నకరికల్ పట్టణంలోకి వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు ఈ విషయంపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ నల్గొండ జిల్లా వైస్ చైర్మన్ బద్దం నాగరాజు గౌడ్, ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని నకిరేకల్ పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.