పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మధ్యాహ్న భోజనానికి అవస్థలు పడుతున్న. సిబ్బంది
జోగులాంబ గద్వాల 10 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : కేటిదొడ్డి మండలంలో పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మధ్యాహ్న భోజనానికి అవస్థలు పడ్డారు. మళ్ళీ వంట చేసే వరకు వేచి ఉండాల్సి వచ్చిందని స్థానికులు పేర్కొన్నారు. గద్వాల, ధరూర్ గట్టు, కేటిదొడ్డి మండలాల్లో జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు మొత్తం 974 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విధులు నిర్వర్తించడానికి 974 పీఓలు, 1,236 ఓపీఓలను నియమించారు.