నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవలి ఎస్సై సురేష్
తిరుమలగిరి 31 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- నూతన సంవత్సరం వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరుమలగిరి మండలంలో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్సై సురేష్ తెలిపారు తిరుమలగిరి మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ బైక్ రైడింగ్ త్రిబుల్ రైడింగ్ చేయడం ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం రాకపోకలకు అంతరాయం కలిగించడం భారీ స్పీకర్లు డీజే సౌండ్స్ పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు సేవించి రోడ్లపై మద్యం సేవిస్తూ తిరగడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు