ఘనంగా ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట

కేటీ అన్నారంలో ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట రూరల్ 12 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ముత్యాలమ్మ తల్లి పండుగ (బోనాలు) తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలంలోని కేటీ అన్నారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ముత్యాలమ్మ తల్లి, పోతురాజు ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆయన ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలు కలిగి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గ్రామ ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హోమం, చండీ హోమం, యాగం, మహా పూర్ణవతి, అత్యంత వైభవోపేతంగా కన్నులపండువగా నిర్వహించారు. గోమాత దర్శనం అనంతరం అన్నదానం గ్రామ ప్రజలకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షఫీ ఉల్లా, వెలుగు వెంకన్న, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్, మాజీ కౌన్సిలర్లు తండు శ్రీనివాస్ గౌడ్, వల్దాస్ దేవేందర్, పిల్లల రమేష్ నాయుడు, స్వామి నాయుడు, ఫారుక్, మాజీ సర్పంచ్ బైరెడ్డి భీమిరెడ్డి, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు