నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ పూర్తి సమాచారం..

Apr 3, 2024 - 19:45
 0  82
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ పూర్తి సమాచారం..

నిజామాబాద్ ఏప్రిల్ 03 తెలంగాణ వార్త ప్రతినిధి:- నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని గత సంవత్సరం 2023 లో 767 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదుకాగా,ఇందులో 337 మంది మరణించడం జరిగినది. ఈ రోడ్డు ప్రమాదాలలో మద్యం త్రాగి వాహనాలు నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.మద్యం త్రాగి నేరాలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు.
మార్చ్ నెల - 2024 లో డ్రంకెన్ డ్రైవ్ కేసులు మొత్తం 649 నమోదు చేసి,ఇందులో జైలు శిక్ష 267 మందికి పడగా ఇందులో కొంత మందికి 10 రోజుల నుండి 14 రోజుల వరకు జైలు శిక్ష చాలా మందికి పడడం జరిగింది.


     కాబట్టి యువత మద్యం తాగి వాహనాలు నడుపరాదు అని, పోలీస్ కళాబృందం ద్వారా అవగాహణ కార్యాక్రమాలు మరియు ట్రాఫిక్ సిబ్బంది ద్వారా వివిధ కళాశాలలో విధ్యార్థులకు అవగాహణ కార్యక్రమాలు నిర్వహించడం జరగుతుంది.కావున జిల్లా ప్రజలు ఇట్టి విషయాన్ని క్షుణ్ణంగా గమనించి,వాహనాలు నడిపే సమయంలో మద్యం సేవించి వాహనాలు నడువరాదు అని తెలియజేయుచున్నాముని నిజామాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఐ.పి.యస్ కల్మేశ్వర్ సింగెనవర్ తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333