కొత్త బస్టాండ్ ముందు పైప్ లైన్ లీకేజ్ మరమ్మత్తులు చేసి - రోడ్డు బాగు చేయడం మరిచిన మున్సిపల్ సిబ్బంది
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు
జోగులాంబ గద్వాల 13 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. పురపాలక సంఘం కొత్త బస్టాండ్ సమీపంలో గత మూడు రోజులుగా వాటర్ లీకేజ్ కారణంతో మున్సిపల్ సిబ్బంది బుధవారం నాటికి మరమ్మత్తులు పూర్తి చేశారు. కానీ రోడ్డును బాగు చేయడం మాత్రం మరిచారు. మరమ్మత్తులు చేసి నామమాత్రంగా రోడ్డును బాగు చెయ్యకుండగా వదిలిపెట్టడంతో భారీ వాహనాలు వెళ్లడంతో పెద్దపెద్ద గుంతలు పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు.కొత్త బస్టాండ్ ముందు వన్‌వే కావడంతో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాకు తెలిపారు. మున్సిపల్ అధికారుల స్పందించి రోడ్డును బాగు చేసి ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండగా చూడాలని కోరుతున్నారు.