ధరణి పాత యాప్ ను పునరుద్ధరించాలి పంతంగి వీరస్వామి గౌడ్.

Oct 9, 2024 - 18:52
Oct 9, 2024 - 22:25
 0  12
ధరణి పాత యాప్ ను పునరుద్ధరించాలి పంతంగి వీరస్వామి గౌడ్.

ధరణి పాత యాప్ ను పునరుద్ధరించాలి.

హైడ్రాతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది.

జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ,

తెలంగాణ సామాజిక ఉద్యమకారులు,

సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు

 పంతంగి వీరస్వామి గౌడ్.

(సూర్యాపేట టౌన్ అక్టోబర్ 9)తెలంగాణ ప్రభుత్వం ధరణి పాత యాప్ ను పునరుద్ధరించాలని జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారులు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వ ని కోరారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఆన్లైన్లో ధరణి పాత యాప్ తీసివేయడం వల్ల పాత మోటేషన్ ఆన్లైన్లో రావడం లేదన్నారు. ధరణి పాత డిజిటల్ యాప్ ను ప్రభుత్వం పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎల్ ఆర్ ఎస్ కోసం తెలంగాణ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు పదివేల చొప్పున చెల్లించారని గుర్తు చేశారు. ఎల్ఆర్ఎస్ స్ కు సంబంధించిన ఆ యాప్ ను ప్రభుత్వం ఆన్లైన్ నుండి తీసివేయడంతో ప్రజలు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గతంలో అధికారులు ఎల్ఆర్ఎస్ లో సర్వే నెంబర్లు, విలేజ్ పేర్లు తప్పుగా నమోదు చేశారని వాటిని కూడా ఎల్ఆర్ఎస్ ద్వారా ఆన్లైన్ అప్లోడ్ చేసుకునేలా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు .రాష్ట్రంలో హైడ్రా మూలంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైందని అన్నారు .రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగించే ఎంతోమంది రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు .ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం హైడ్రాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని వాపోయారు. స్వయంగా అధికారులే రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కు సెప్టెంబర్ నెలలో ఆదాయం తగ్గిందని పేర్కొన్నారు. హైడ్రాతో రిజిస్ట్రేషన్లు శాతం తగ్గిపోయి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లిందని గుర్తు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టణ కార్యదర్శి అయితే గాని మల్లయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ గిరీశం పట్టేటీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223