తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ పాత్ర మరువలేనిది

Aug 6, 2024 - 19:44
Aug 6, 2024 - 20:45
 0  5
తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ పాత్ర మరువలేనిది

తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ పాత్ర మరువలేనిది

- *జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క* 

ఆగస్టు 6 ములుగు తెలంగాణ వార్త:- ములుగు జిల్లా కేంద్రములో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క 

ఈ సందర్భంగా మాట్లాడుతూ 

తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌ కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన నిరంతర కృషిని, ఆయ‌న ధృడ సంక‌ల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మరచిపోలెం

తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరువలేనిది. తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తిండిపోయే వ్యక్తి జయశంకర్ సార్. ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సేవ‌ల‌ను తెలంగాణ ప్రజలు, భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా వారి సంకల్ప బలం రాష్ట్ర సాధనకు చేసిన నిర్విరామ కృషి అంచ లంచలుగా ఆశయ ఆలోచనలకు పడును పెడుతూ, రాష్ట్ర సాధనకు ఆయువుపట్టు అయినారు. అందరి హృదయాలలో నిలిచారు అని మంత్రి సీతక్క అన్నారు 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్ తదితరులు