తెలంగాణ తొలి ప్రభుత్వంలో ధ్వంసమైన యూనివర్సిటీ విద్య

Mar 19, 2024 - 15:50
Mar 19, 2024 - 16:47
 0  1

నియామకాలు సౌకర్యాలు కల్పించకపోగా  రాష్ట్ర ప్రభుత్వ సమీక్ష అసలే లేదు.

పైగా ఫీజులు పెంచి,  ప్రైవేటు విశ్వవిద్యాలయాలను అనుమతించి  ఉన్నత విద్యను పేదలకు దూరం చేసింది నిజం కాదా?


---  వడ్డేపల్లి మల్లేశం 

ఉమ్మడి రాష్ట్రంలో  హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ఖ్యాతిని గడించి  ఎంతోమంది పరిశోధకులకు పర్యాటకులకు విద్యావంతులకు  స్పూ ర్తిగా నిలిచినది.  నేడు ర్యాంకులలోను సౌకర్యాలలోనూ  గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సుమారు 10 ఏళ్ల పాటు  వివక్షతకు  గురైన రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల  బోధన  పరిశోధన పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏనాడు  సమీక్షించి తగిన చర్యలు తీసుకో ని కారణంగా ఈ దుస్థితి నెలకొన్నది.  .ముఖ్యంగా రాష్ట్రములోని విశ్వవిద్యాలయాలు  తెలంగాణ సాధన తో పాటు అనేక ప్రజా ఉద్యమాలకు ఊపిరి పోసిన కేంద్రాలుగా మిగిలిపోయినప్పటికీ  నిధుల  సిబ్బంది కొరత ,నిర్లక్ష్యం కారణంగా  కళావిహీనమై  అక్కడక్కడ శిథిలావస్థకు చేరుకోవడం అత్యంత విచారకరం . 2021 లో గత ప్రభుత్వం  వి సీల నియామకాలను చేపట్టి నది. మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ నియామక ప్రక్రియ  గత ప్రభుత్వ హయాములో  పాలకుల యొక్క దయాదాక్షిణ్యముతో కొనసాగినట్లు  ప్రభుత్వ అనుకూల వర్గాల వారికి మాత్రమే విసి పదవులు ఇచ్చినట్లు అనేకమంది మేధావులు బుద్ధి జీవులు విమర్శిస్తున్నారు . అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి వత్తాసు పలుకుతారే తప్ప విద్యారంగ అభివృద్ధికి విశ్వవిద్యాలయ స్థాయి పెంపుదలకు  కృషి చేస్తారనే విశ్వాసం లేదు.  తెలంగాణ ఉద్యమ కేంద్రాలుగా  ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన విశ్వవిద్యాలయాలలో  సిబ్బంది భర్తీ,  నిర్వహణకు నిధులు సరిపోక  రెగ్యులర్ బోధన బోధనేతర సిబ్బంది లేకుండా  కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించి  శ్రమ దోపిడీకి పాల్పడుతుంటే ఇక  ప్రపంచ స్థాయి విజ్ఞానాన్ని అందించవలసినటువంటి విశ్వవిద్యాలయాలకు  సామాజిక బాధ్యత  సాధ్యమేనా!  రాజకీయ జోక్యము కులమత  ఆదిపత్య వర్గాల  చొరవ కారణంగా  మరొకవైపు  యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రభుత్వ నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు పక్కదారి పట్టడమే కాదు  ప్రభుత్వ అనుకూల వి సీలు ఉన్న ప్రతి చోట  ప్రజా దృక్పదము కొరవడిన మాట కూడా వాస్తవం.  వి సీల నియామకం ఎక్కడైతే పారదర్శకంగా జరుగుతుందో  అప్పుడు మాత్రమే వాటి లక్ష్యాలు నెరవేరడంతో పాటు  ప్రమాణాలతో కూడిన విద్య, పరిశోధన, మేదో సంపద,  కొత్త కోర్సుల ప్రవేశము, అని  విద్యార్థులకు ఫెల్లోషిప్ వంటి సౌకర్యాల వలన  పేద వర్గాలు ఉన్నత విద్యను అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
        గత ప్రభుత్వంలో ధ్వంసమైన తీరును గమనిస్తే:-
-------------------------------
  2016లో తొలిసారిగా వి సీల నియామకం జరిగిన తర్వాత  2019లో మళ్లీ ఇన్చార్జిల పాలన కొనసాగినట్టు తెలుస్తున్నది  ఆ తర్వాత 2021లో బీసీల నియామకాలను చేపట్టినప్పటికీ  ప్రభుత్వం తనకు అనుకూలమైన వారిని నియమించుకున్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి.  ప్రస్తుతము 10 విశ్వవిద్యాలయాల గాను నూతన వైస్ ఛాన్స్లర్ నియామకాలకు రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసినట్టు తెలుస్తుంది.  ఈ పోస్టుల భర్తీకి వందలాది దరఖాస్తులు వచ్చినప్పటికీ  సామాజిక చింతన,  విద్యారంగ అభివృద్ధి ,నిబద్ధత,  శాస్త్రీయ దృక్పథము,  సమర్థత, విష పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్లను రాజకీయాలకు అతీతంగా ఎంపిక చేసినప్పుడు మాత్రమే  గత ప్రభుత్వ హయాములో జరిగినటువంటి లోపాలను సవరించడానికి అవకాశం ఉంటుంది.  కొత్తగా మహిళా ఫారెస్ట్ యూనివర్సిటీలను ప్రభుత్వము ప్రారంభించినప్పటికీ  ఉన్న వాటికే కనీస సౌకర్యాలు ఫ్యాకల్టీ లేని పరిస్థితులలో  బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆందోళనలు నెలల తరబడి సాగిన సందర్భం మనందరికీ తెలిసిందే.  భోజన సౌకర్యం, ల్యాబ్స్ ,లైబ్రరీలు సరిగా లేక  హాస్టల్ భవనాలు శిథలావస్థకు  చేరుకొగ  నిధులు సరిగా ఇవ్వకుండా  ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ప్రాధాన్యతను ప్రభుత్వమే క్రమంగా తగ్గించి  వైద్య వసతి సదుపాయాలు లేకుండా చేసి ప్రభుత్వ రంగాన్ని బ్రష్టు పట్టించిన విషయం వాస్తవం కాదా ?
    2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  ఇప్పటివరకు కూడా రాష్ట్ర  యూనివర్సిటీలలో నియామకాలు లేవు.  పైగా 24 శాతం మాత్రమే రెగ్యులర్ పోస్టులు ఉంటే మిగతా అన్ని కూడా తాత్కాలిక కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతూ ఉండడాన్ని గమనిస్తే  మన విశ్వవిద్యాలయ విద్య ఎంత దుస్థితిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.  ఉద్యోగ విరమణ జరిగిన తర్వాత సంవత్సరాల తరబడిగా ఖాళీ ఉండటం వలన  బోధనా అభ్యసన ప్రక్రియకు  కొంటుపడుతున్నది.  ఒక అంచనా ప్రకారంగా రాష్ట్రంలో 8000 బోధన  బోధనేతర ఖాళీలు ఉన్నాయని 2020లో ప్రభుత్వమే ప్రకటించినప్పటికీ  రెగ్యులర్ ఉద్యోగులతో భర్తీ చేయకుండా కాంట్రాక్టు పార్ట్ టైం పద్ధతిలో భర్తీ చేసిన కారణంగా  కొన్ని కోర్సులు మూసివేయడం ,పరిశోధకులు విరమించుకోవడం, అవకాశాలు లేక  విద్యార్థులు డ్రాప్ అవుట్ కావడం జరిగినట్టుగా తెలుస్తున్నది.  అరకొర సౌకర్యాల మధ్య 2828 పోస్టులు మంజూరు కాగా 1869 పోస్టులు  నింపకుండా ఖాళీగా ఉన్నట్లు  ఆ భర్తీ చేయని కార్లలో  238 ప్రొఫెసర్, 781 అసోసియేట్ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటం వలన  నాణ్యమైన విద్య అందని కారణంగా  గత్యంతరం లేని పరిస్థితుల్లో పేద వర్గాలకు మాత్రమే ఉపయోగపడుతున్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కూడా  సరైన విద్యను అందించని కారణంగా  లక్షలాది  మందికి ఉన్నత విద్య అందనీ ద్రాక్ష గానే మిగిలిపోతున్నది.  ఇక ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు నిధులు మంజూరు లేకపోవడం,  వి సీలు  అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నట్లు  ఆ కారణంగానే  వివిధ కోర్సుల ఫీజును భారీగా పెంచినట్లు తెలుస్తున్నది.  తెలంగాణ రాకముందు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 3000 నుంచి 5000 ఉన్నటువంటి కోర్సు ఫీజును 35వేల రూపాయలకు, 2000 రూపాయలు ఉన్న పీహెచ్డీ ఫ్రీజ్ను 20 వేల రూపాయలకు పెంచారు అంటే  అణగారిన వర్గాలకు   విద్యను అందకుండా చేయడమే.

విశ్వవిద్యాలయ విద్య ప్రస్తుత ప్రభుత్వం పైన  అదనపు బాధ్యత :-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అయినా అనేక సందర్భాలలో విద్యారంగం మీద సమీక్ష చేసిన చరిత్ర ఉన్నది కానీ మన రాష్ట్రంలో  ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యారంగం పైన సమీక్ష చేసిన సందర్భం ముఖ్యమంత్రి స్థాయిలో లేదనే చెప్పాలి.  కొత్త ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయ వి సీలు లేదా నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి  సిబ్బంది మౌలిక సౌకర్యాలు  పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన చర్చించి నిధులను మంజూరు చేసి  వర్సిటీ విద్యను మెరుగుపరచాలి.  కోర్సుల ఫీజులు  పిహెచ్డి ఫీజులను   పెంచిన వాటిని భారీగా తగ్గించాలి . ప్రజా జీవితానికి సంబంధించి  సామాజిక ఆర్థిక వ్యవసాయ  రంగాలకు సంబంధించిన అంశాల పైన  మరిన్ని పరిశోధనలకు అవకాశాన్ని కల్పిస్తూ  ఆర్థికంగా సహకరించి ప్రోత్సహించాలి.  నేషనల్ ఫెలోషిప్  పీజీ విద్యార్థులకు  స్కాలర్షిప్స్ హాస్టల్ వసతి సౌకర్యాలు  లైబ్రరీలు ల్యాబ్లు పరిశోధన కేంద్రాలు  ఏర్పాటు చేయడానికి యూనివర్సిటీల వారీగా అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలి.  విశ్వవిద్యాలయాలతో పాటు వాటి అనుబంధ కళాశాలలను కూడా  అభివృద్ధి పరిచే క్రమములో  మౌలిక సౌకర్యాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి విద్యారంగాన్ని  పరిపుష్టి చేయవలసిన అవసరం ప్రస్తుత ప్రభుత్వం పైన చాలా ఉన్నది.  ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధిపతి ప్రొఫెసర్ కాసిం గారు  మౌలిక సౌకర్యాలను కల్పించాలని ఎండలోనే ఆరు బయట తరగతి గదులు నిర్వహించి  నిరసన తెలిపినప్పటికీ  గత ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు.  ఎండలో ముఖ్యమంత్రి కోసం గద్దర్  గారు వేచి ఉన్నట్లే  కాసిం గారి నిరసన బోధన  కార్యక్రమంతో  స్పందించని గత పాలకుల  తీరును ఎండగట్టి  యూనివర్సిటీల ముఖచిత్రాన్ని  తీర్చిదిద్ది గతంలో ఉన్న అంతర్జాతీయ జాతీయ స్థాయి ర్యాంకులను  సాధించి పెట్టాల్సిన బాధ్యత  రాష్ట్ర ప్రభుత్వానిదే. కొనసాగుతున్న 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను రద్దు చేసి ప్రారంభించడానికి గత ప్రభుత్వం ప్రతిపాదించిన 7విశ్వవిద్యాలయాలను కోడావిరమించుకోడం కాంగ్రెస్ ప్రభుత్వ సామాజిక బాధ్యత.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333