తెరువని మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ . ఎస్ ఓ నిర్లక్ష్యం విద్యార్థినుల అవస్థలు.
నాగారం జూన్ 21: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలను తిరిగి ప్రారంభించి ఇరవై రోజులు అవుతున్నప్పటికీ నాగారం మండల పరిధిలోని పసునూరు మోడల్ స్కూల్ లో ఉన్న బాలికల హాస్టల్ తెరవకపోవడం ఎస్ ఓ నిర్లక్ష్యానికి నిదర్శనమని విద్యార్థులలో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలల ప్రారంభానికి రెండు రోజుల ముందే హాస్టల్ వసతులను పరిశీలించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1న హాస్టల్ ను తిరిగిన ప్రారంభించాల్సి ఉండగా అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారిని మాత్రం ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. గత మూడు రోజులుగా విద్యార్థునిలు కళాశాలకు హాజరవుతూ తిరిగి ఇంటికి వెళ్తున్నారు. రవాణా సౌకర్యం లేని విద్యార్థులు మాత్రం కళాశాలకు రావడానికి ఇబ్బందులు పడుతూ గైరాజరవుతున్నారని తెలిపారు. గురువారం రోజు 14 మంది విద్యార్థినిలు కళాశాలకు హాజరై తిరిగి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఏడుగురు విద్యార్థులు కళాశాలకు హాజరైనారు. మధ్యాహ్నం భోజనాన్ని ఇంటి వద్ద నుండి తెచ్చుకుంటున్నామని వారు తెలిపారు. రోజులు కలుస్తుండటంతో కళాశాలలో పాటలు తప్పిపోతున్నాయని విద్యార్థులను ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు స్పందించి స్పెషల్ ఆఫీసర్ పై చర్యలు తీసుకొని హాస్టల్ ను ప్రారంభించాలని కోరారు.
ఫోన్లో లో ఎస్ ఓ వివరణ కోరగా
పాఠశాలలో మోటర్ కాలిపోయిందని చిన్నచిన్న మరమ్మతులు ఉన్నాయని అందుకే హాస్టల్ తెరవలేదని తెలిపారు. విద్యార్థినిలు ఎవరు హాస్టల్ కు రాలేదని అన్నారు.