తిరుమలగిరిలో ఎయిడ్స్ పై అవగాహన
తిరుమలగిరి 01 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ప్రాథమిక ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మరియు ప్రజలు కలిసి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మల్లెల వందన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలని ప్రజలలో చైతన్యవంతం తీసుకురావాలని కోరారు. ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదని తెలియని వారి తో మరియు ఒకరు లేదా పలువురుతో శృంగారం చేస్తే వచ్చేదే వ్యాధి అని వివరించారు. అందువలన ప్రతి ఒక్కరు శుభ్రత పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రక్త మార్పిడి అపరిశుభ్రత వలన, ఆ రక్షిత లైంగిక సంపర్కము ద్వారా వచ్చే వ్యాధి కాబట్టి, ప్రతి ఒక్కరూ హెచ్ఐవి టెస్ట్ చేపించుకోవాల్సిందిగా కోరడమైనది. ముఖ్యంగా గర్భవతులు వారి భర్తలు తప్పనిసరిగా హెచ్ఐవి టెస్ట్ పరీక్షలు చేపించుకోవాలి. దీనివలన పుట్టపోయే బిడ్డకు హెచ్ఐ నుండి రక్షణ పొందేందుకు అవకాశం ఉంటుంది అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ స్వరూప ఏఎన్ఎంలు మాధవి రజిత శ్రీలత మరియు ఆశ వర్కర్లు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.