తాటిపాములలో ప్రత్యేక విద్యుత్ లైను ఏర్పాటుకు పరిశీలన
తిరుమలగిరి 09 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
మండలంలోని తాటిపాముల గ్రామానికి విద్యుత్ సబ్స్టేషన్ నుండి ప్రత్యేక లైన్ ఏర్పాటు కోసం విద్యుత్ అధికారులు గురువారం పరిశీలించారు. జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సొంత గ్రామానికి ప్రత్యేకంగా లైన్ లేకపోవడంతో వారి ఆదేశాలతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో గ్రామంలో ప్రత్యేక లైనుకు ఎన్ని స్తంభాలు ఎంత వైరు అవసరం ఉందని పరిశీలించి వెళ్లారు. పరిశీలనలో విద్యుత్ అధికారులు ఏఈ గోపాల్, లైన్మెన్ రాజేష్, కాంట్రాక్టర్ రమేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాయిని కృష్ణ, నాయకులు ఎర్ర యాదగిరి, బోయపల్లి కిషన్ పరశురాములు, తదితరులు ఉన్నారు.