తాటిపాముల గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ అధికారుల పరిశీలన
తిరుమలగిరి 10 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
మండలంలోని తాటిపాముల గ్రామానికి మెటల్ రోడ్లు, సిసి రోడ్లు,డ్రైనేజీ కాలువల పనుల మంజూరు కోసo పంచాయత్ రాజ్ డిఈఈ ఎల్.బాబురావు శుక్రవారం గ్రామంలో పరిశీలించారు. జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సొంత గ్రామానికి మెటల్ రోడ్లు, సి సి రోడ్లు,డ్రైనేజీలు లేకపోవడం తో గ్రామ ప్రజలు మంత్రి కలిసి పనులు మంజూరు చేయాలని విజ్ఞప్తి మేరకు మంత్రి ఆదేశాలతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో గ్రామంలో పనుల మంజూరు కోసo పరిశీలించారు.ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిమామిడి యాదగిరి, పాలబిoదేల లక్ష్మయ్య,ఎర్ర యాదగిరి, తాటిపాముల నర్షింహ, బోయపల్లి కిషన్ పరశురాములు,కృష్ణయ్య,రమేష్,వెంకటయ్య, తదితరులు ఉన్నారు.