తాటిపాముల కంకర తేలిన రోడ్డు ...నరకయాతన ప్రయాణం
"రాకపోకలకు వాహనదారుల అవస్థలు...
తిరుమలగిరి 25 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రం నుంచి తాటిపాముల గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రోడ్డు పూర్తిగా కంకర తేలి అధ్వాన్నంగా మారింది. రోడ్డు గ్రామస్థులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు దెబ్బతిని ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించేందు కు సంబంధిత అధికారులు చొరవ చూపడం లేదు... నిత్యం ఈ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. కంకర తేలి ఉన్న ఈ రోడ్డు పై వెళ్లాలంటే నిత్యం నరకయాతన పడుతు న్నామని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులైతే ఎదో ఓకచోట పడి గాయాలపాలవుతున్నారని గ్రామస్థులు వాపో తున్నారు. ఈ రోడ్డు దెబ్బ తినడంతో గ్రామానికి వెళ్లేందుకు తీవ్ర అవ స్థలు పడుతు న్నామని చెబుతున్నారు. ప్రతి రోజు మండల కేంద్రానికి పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఈ రోడ్డు వెంట అతి కష్టంగా రాకపోకలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.