తనది ఒక తీరు పరాయి వాళ్ళది మరొక తీరు

పురుషులను మించిన స్థాయిలో కొందరు మహిళల వికృత ఆలోచన.
మానవ సంబంధాలను శాసించే దుర్నీతిలో కొందరు పోటీ పడడమే విషాదకరం
హేతుబద్ధంగా ఆలోచిస్తే నిజాలనిగ్గూ తేలుతుంది
----వడ్డేపల్లి మల్లేశం
కుటుంబ బంధాల పరిరక్షణలో పురుషులు స్త్రీలు సమాన బాధ్యత వహించి మానవ సంబంధాల బలోపేతానికి కృషి చేయవలసిన తరుణంలో స్వార్థం, వివక్షత, పెడదో రనుల కారణంగా పురుషుల కంటే స్త్రీలు ముందు వరుసలో ఉండడాన్ని కొంతవరకు మనం గమనించవచ్చు . మనసులు గాయపడినా, ఇబ్బంది అనిపించినా, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగినప్పటికీ కొన్ని విషయాలు నిర్మోహమాటంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ వరుసలో ముఖ్యంగా కుటుంబ బంధాల విషయంలో వ్యక్తుల మధ్యన పగుళ్లు ఏర్పడడానికి చాలా సందర్భాలలో స్త్రీలే ప్రధాన కారణమని సంఘటనలు సన్నివేశాలు సందర్భాలను గమనించినప్పుడు తేటతెల్లమవుతుంది. కుటుంబ అనుభవాలను ఆధారంగా చేసుకుని, సంఘటనలను సరిచూసుకొని, హేతుబద్ధంగా ఆలోచించినప్పుడు వాస్తవం, తేడా తేట తెలమవుతుంది . సృష్టిలో జీవితానికి ప్రధానంగా స్త్రీలే ఆధారమని ,అక్కడనే మనిషి కథ ప్రారంభమవుతుందని, కుటుంబ సంతోషానికి సంతాపానికి కూడా స్త్రీలే ముఖ్యమని సినీ రచయితలు కవులు అనేక సందర్భాలలో వర్ణించినవిషయాలను గమనించినప్పుడు ఈ విషయం మరింత స్పష్టమవుతుంది ..పంతాలు పట్టింపులు కయ్యాలు ఘర్షణ సంఘర్షణల విషయంలో ముఖ్యంగా వ్యక్తుల యొక్క వివక్షత బయటపడుతుంది .ఈ క్రమంలో పురుషులు కొంత ఇచ్చిపుచ్చుకునే పద్దతిలో సర్దుబాటు రీత్యా వ్యవహరించినప్పటికీ స్త్రీలు మాత్రం కచ్చితంగా నిలదేస్తున్న కారణంగా అనేక కుటుంబాల మధ్యన చిచ్చు, గాయాలు చెల రేగుతున్న విషయాన్ని మనం నిత్యజీవితంలో గమనించవచ్చును.
తన తల్లిదండ్రులు ఒక రీతిగా అత్తమామలను మరొక రీతిగా చూడడంలోనే స్త్రీ యొక్క వివక్షత, ఒంటెద్దు పోకడ, స్వార్థము, అహంకారము, సాధింపులు మనకు స్పష్టమవుతున్నా యి. తన తల్లి తన పుట్టింటిలో అన్నదమ్ముల వదినల చేతిలో అన్యాయానికి గురవుతున్నట్లు , ఆకలి దప్పులతో అలమటిస్తున్నట్లు, నిరాదరణ కారణంగా కుమిలిపోతున్నట్లు ఆవేదన చెందే ఇల్లాలు తన ఇంట్లో తన సమక్షంలో తన ఆధీనంలో వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలను చూసుకునే విషయంలో ఎంతో తేడాను కనబరుస్తుంటారు. అంతేకాదు తన పుట్టిన ఇంటి నుండి తెచ్చి పెట్టినట్టుగా
అత్తమామల పట్ల సాచివేత వైఖరిని అవలంబించి, మానసికంగా కృంగదీసి , అవమానం పాలు చేస్తున్న సందర్భాలను మనం కోకోలలుగా గమనించవచ్చు . ఈ రకమైన వ్యత్యాసానికి కారణం ఏమిటి? రెండు సందర్భాలు ఒకటే అయినప్పుడు ఒక రి 0ట తన వాళ్లు కష్టపడుతున్నారని ఆరాటపడడం ఎందుకు? తన అత్తమామలను దానధర్మానికి పెంచి పోషిస్తున్నట్లుగా , చులకనగా చూడడం ఎందుకు ? ఇది కొంతమంది తెగించిన మహిళల యొక్క వికృత దుర్నీతి కాదా ?తన తల్లి గారి పక్షం వాళ్లు త నకు నచ్చిన వాళ్ళు ఇంటికి వస్తే సాదరంగా ఆహ్వానించి, బంధువులుగా గుర్తించి, ఆదరించి ఆత్మీయంగా పలకరించే ధోరణినితో ప్రేమపంచుతుంది. కుటుంబానికి ఉమ్మడిగా బంధువులు అయినటువంటి వారు వచ్చిన సందర్భంలో వారిని బంధువులుగా చూడకుండా, అపరిచితులుగా భావించి, భర్త తరపు వాళ్లుగా రెండవ శ్రేణిగా గుర్తించి, నిరాదరించి అవమానించి సాగనంపిన సందర్భాలను కూడా మనం గమనించవచ్చు. అంతెందుకు తన ఇంట్లో తల్లి తండ్రులు అత్తమామలు ఏకకాలంలో ఏదైనా సందర్భంలో ఉన్నప్పుడు గమనిస్తే తల్లిదండ్రుల పైన అమిత ప్రేమను ధారవోసి, అత్తమామల పట్ల కనీస మైన ప్రవర్తన కనబరచకుండా ఉండే పాశవిక నైజాన్ని తత్వాన్ని మీరు, మనం ఎన్ని సందర్భాలలో చూడలేదు ? వ్యక్తులు ఎవరనేది కాదు,ఈ యిo ట జరిగింది అనేది కూడా ముఖ్యం కాదు, కానీ దాదాపుగా ప్రతి ఇంట జరుగుతున్న ఈ దుష్ట దౌర్భాగ్య ధ మన నీతిని ఖండించవలసిన అవసరం లేదా? సుమారుగా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళ ఆధిపత్యం అధికారికంగా చట్టబద్ధతను సంతరించుకున్న సందర్భంలో...... కుటుంబ గౌరవాన్ని కాపాడే క్రమంలో యజమానిగా పురుషుడు కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి వ్యవహరించి, ఆడవాళ్ళ నోటికి భయపడి, ఘర్షణ వైఖరి తలెత్తకుండా జాగ్రత్త పడుతున్న సందర్భాన్ని బలహీనతగా భావిస్తున్నది నిజం కాదా? కుటుంబంలో జరిగే శుభ కార్యక్రమాలు లేదా ఆశుభ కార్యక్రమాల సందర్భంగా తీసుకునే నిర్ణయాలు, కట్నకానుకలు, గౌరవ మర్యాదలు యి చ్చిపుచ్చుకోవడానికి అన్నింట కూడా స్త్రీలు వివక్షతగా వ్యవహరించడం , పురుషుల ప్రమేయం లేకుండా ఏక వ్యక్తి పాలన లాగా నిర్ణయాలు తీసుకోవడం, దానికి తన తల్లి గారి ఇంటి వాళ్ళు ఆజ్యం పోయడం మన అనుభవములోనిదే .కుటుంబ సంక్షేమం అభివృద్ధి ఇతరత్రా సందర్భాలు సన్నివేశాలు సమస్యల పరిష్కార విషయంలో కుటుంబానికి సహకరించినటువంటి వాళ్లను పక్కనపెట్టి వారిని గుర్తించకుండా మొక్కుబడిగా కేవలం అన్నదమ్ములను తల్లిదండ్రులు, ఆ తరపు వారిని ఆకాశానికి ఎత్తి పీటలపై కూర్చుండబెట్టి లేనిపోని అబూత కల్పనలు కల్పించి క్షణములోనే ఘర్షణలు సృష్టించి కార్చి చ్చు లాగా తయారు చేసే విషయం మనందరికీ తెలియనిదా ?
తన తల్లి గారి ఇంటి తరఫున ఏదైనా అశుభ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు జరిగినప్పుడు అన్ని రకాలుగా గౌరవించాలని, నకానుకలు సమర్పించాలని, విందులు వినోదాలలో భాగస్వామి కావాలని కోరుకునే ఒక ఇంటి ఇల్లాలు తన అత్తమామల పక్షాన జరిగినటువంటి శుభ అశుభ కార్యక్రమాలలో కనీసం తన తల్లి గారి ఇంటి పక్షాన భాగస్వామ్యం లేకపోయినా, పలకరించకపోయినా, పరామర్శించకపోయినా ఇది ఎట్లా ?అని ప్రశ్నించకుండా సమర్థించే ధోరణిని ఎలా చూడాలి? ఇన్ని రకాలుగా స్త్రీ వివక్షత పద్ధతిలో తన నిత్య జీవితంలో వ్యవహరిస్తూ అనేక ఉత్పత్తి కుటుంబాలలో కూడా ఉత్పత్తికి దూరంగా ఉన్నటువంటి స్త్రీలు సైతం యజమాని కష్టాన్ని కన్నీటిని త్యాగాలను కూడా గుర్తించకుండా ఒంటెద్దు పోకడగా వ్యవహరించడం దిక్కుమాలిన పని కాక మరి ఏమవుతుంది ? ఇలాంటి సందర్భంలో తన కూతురు తమను సమర్తిo చి తమ పక్షాన మాట్లాడినటువంటి విషయాల్లో విజ్ఞత గల తల్లిదండ్రులు తమ కూతురు చూపే వివక్షతను గుర్తించి మందలించవలసిన అవసరం ఉంది .కానీ అనేక కుటుంబాలలో సందర్భాలలో ఆ రకమైనటువంటి వారింపు చేయకపోగా కూతురు ఇష్టా ఇష్టాలను, ఆలోచన సరళిని , ఏకపక్ష విధానాలను సమర్థించే ప్రయత్నం చేయడం వల్ల రోజురోజుకు కుటుంబ బంధాలు నిర్వీర్యమై , అవమానకరమై ,ఆదిపత్యానికి చిరునామాగా మారుతున్న సందర్భాలను మందలించవలసినది ఎవరు ?మార్చవలసినది ఎవరు? ప్రేమానురాగాలకు చిరునామాగా ఆత్మీయత అనురాగాలకు నిలయంగా కక్షలు కార్పన్యాలు ఘర్షణ సంఘర్షణలు లేకుండా గృహమేకదా స్వర్గసీమ అనే విధంగా దిద్దుకోవల్సిన మన ఇంటిని తీర్చిదిద్దుకోవలసిన అవసరం లేదా? ఘర్షణలు లేనిపోని కయ్యాలను సృష్టించి, అసమానతలు అంతరాలను రంగరించి, చిన్న చూపు చూసే విధానం లో అక్కడక్కడ పురుషుల పాత్ర కూడా లేకపోలేదు కానీ పెద్ద మొత్తంలో స్త్రీలు ఈ విషయంలో పోటీ పడుతూ తమ హుందాతనాన్ని విశాల హృదయాన్ని మానవత్వాన్ని చంపుకొని ఘర్షణకు దిగుతున్న కారణంగా అనాదిగా మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవానికి భంగం జరుగుతున్న విషయం నిజం కాదా? ఇప్పటికైనా మహిళా లోకం హేతుబద్ధంగా ఆలోచించి నిజాల నీ గ్గు తేల్చాలి .తమ పొరపాటు ఉంటే సవరించుకోవాలి, పురుషుల భాగస్వామ్యంలో గతి తప్పితే మార్చుకోవడానికి సిద్ధపడాలి. కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా కుటుంబం బజారు పాలు కావడానికి ప్రధాన భూమిక పోషిస్తున్న విధంగా వీధికేక్కుతున్న మహిళలోకం తమ పాత్రను తగ్గించుకుంటే మంచిది. మంచి విషయంలో పోటీ పడదాం! ప్రేమానురాగాలను పెంపొందించడంలో ఆరాటపడదాం! కుటుంబ బంధాల బలోపేతానికి కృషి చేద్దాం! మానవ సంబంధాలు మసకబారి పోకుండా నిరంతరం ఉమ్మడిగా ప్రయత్నం చేద్దాం! కానీ తోటి మనిషిని సాటి మనిషిగా చూడకుండా కట్టుకున్న భర్తనే పక్కన పెట్టే దుష్ట సంప్రదాయానికి నేడే చర మగీతం పాడాలి! మహిళా లోకం తమ మానవతా ధోరణి సమీక్షించుకోవాలి .లొసుగులు లోపాలు ఉంటే సవరించుకుంటే మంచిది . ఆత్మీయతకు అనురాగానికి నిలయమైన స్త్రీలు ఘర్షణలకు వివక్షతకు తావివ్వకూడదనేదే విమర్శకు బలి కాకూడదనేదే ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం. "కలిసి పోదాం, కలిసి ఉందాం, పదిమందిని కలుపుకుందాం. .ఇంతకు మించిన మానవతా నినాదం మరొకటి లేదు.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )