టిడిపి సభ్యత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాం గారు

ఏపీ తెలంగాణ ప్రతినిధి:- టిడిపి సభ్యత్వ కార్యక్రమాన్ని(2024-26) విజయవంతం చేయాలి మాజీ మంత్రి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీరఘురామ్ గారుఈరోజు తన నివాసంలో నూజివీడు నియోజకవర్గ రాష్ట్ర పరిశీలకుడు గింజుపల్లి రమేష్ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి షేక్ అన్వర్ తెలుగుదేశం నాయకులు సూర్యదేవరవెంకట లక్ష్మీ నరసింహారావు(బుజ్జి)లకు డిజిటల్ సభ్యత్వాలను అందజేశారు.
ఈ సందర్భంగా నెట్టెం శ్రీరఘురామ్ గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో మరియు జగ్గయ్యపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పెద్ద ఎత్తున జరుగుతోందని అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారని కేవలం ఎనిమిది రోజుల్లోనే 10 లక్షల సభ్యత్వాలు రాష్ట్రవ్యాప్తంగా నమోదయాయని తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఐదు లక్షల ప్రమాద బీమా మరియు విద్య వైద్యం ఉపాధి అవకాశాలను తెలుగుదేశం కార్యకర్తలకు అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు