జూనియర్ కళాశాల మంజూరు చేయించిన ఎమ్మెల్యే మందుల సామేలుకు ధన్యవాదాలు
తిరుమలగిరి 08 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్ తిరుమలగిరి మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేయించి జీవో తీసుకు వచ్చిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలుకు జిల్లా కాంగ్రెస్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ సుంకరి జనార్ధన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుమలగిరిలో జూనియర్ కళాశాల కోసం గత 30 సంవత్సరాలుగా యువకులు, విద్యార్థులు నిరుద్యోగులు కలిసి ఎన్నో ఉద్యమాలు చేసిన గతంలో ఉన్న పాలకులు పట్టించుకోకుండా తిరుమలగిరిపై నిర్లక్ష్య వైఖరి అవలంబించారని ఆయన అన్నారు తిరుమలగిరిలో కళాశాల లేకపోవడం మూలంగా దూరప్రాంతాలకు వెళ్లి నిరుపేద విద్యార్థులు ఖరీదైన చదువులను చదువుకోలేక మధ్యలోనే తమ చదువుకు స్వస్తి పలుకుతున్నారని అన్నారు
కానీ నేడు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం హామీ నిలబెట్టుకొని ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని అన్నారు ఎందరో నాయకులు తిరుమలగిరి అభివృద్ధికి ఆటంకం కలిగించిన నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రుల సహకారంతో తుంగతుర్తి శాసనసభ్యులు పట్టుబట్టి ఎన్నికల్లో వచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత దక్కిందని అన్నారు ఇప్పటికైనా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన వైపు మొగ్గుచూపి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు