జిల్లాలో జ్వరాలను నియంత్రించండి వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య
జిల్లాలో జ్వరాలను నియంత్రించండి వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య
ములుగు జూన్ 24 తెలంగాణ వార్త:- ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశానుసారము, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయము సమావేశ మందిరంలో, జిల్లాలోని వైద్యాధికారులకు,మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కి,పారామెడికల్ సిబ్బందికి డాక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో సమావేశము నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో పలు అంశాలపై సమీక్ష జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య నిర్వహించారు. ఇందులో భాగంగా,ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలలో, ఉపకేంద్రములలో మౌలిక సదుపాయాల లభ్యత గురించి, మానవ వనరుల గురించి,ఆరోగ్య సేవలు విస్తృతంగా అందించేందుకు కావలసిన సదుపాయాల గురించి,ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు వైద్యాధికారులు,వైద్య సిబ్బందిచే తగిన సలహాలు ,సూచనలు ఇవ్వాలని కోరారు.రాబోవు వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్కరు కూడా జిల్లాలో వైద్య సేవలు అందకుండా మృతి చెందారని వార్తలు రాకుండా ప్రజలకు వైద్యాధికారులు,
వైద్య సిబ్బంది నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు.వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని,
హెడ్ క్వార్టర్స్ విడిచిపెట్టి వెళ్ళకూడదని తెలిపారు.వరద ముంపు ప్రాంతాలలో క్లిష్టతరమైన గ్రామాలలోని గర్భిణీ స్త్రీలను దగ్గరలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కు తరలించాలని కోరారు.ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ,వైద్యాధికారులు తమ, తమ గ్రామాలను తరచుగా ఇండ్లను సందర్శించాలని,జ్వరాలతో బాధపడుతున్న వారికి రక్త పరీక్షలు ,మలేరియా రోగ నిర్ధారణ పరీక్షలు జరపాలని, మలేరియా అని నిర్ధారణ జరిగితే వెంటనే చికిత్స ప్రారంభించాలని, చికిత్స అనంతరము కూడా వారిని వారి కుటుంబ సభ్యులను సందర్శించాలని,వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలని,అప్పుడే జ్వరాలను మనం నియంత్రించిన వాళ్ళం అవుతామని తెలిపారు. వైద్యాధికారులు ప్రజల యొక్క ఆరోగ్యపరమైన ఇబ్బందులను తెలుసుకొని,వాటిని నిర్ధారణ పరీక్షలు జరిపించి చికిత్సలు అందజేయాలని, గ్రామాలలోని నాయకులతో సహకారం తీసుకోవాలని కోరారు.ఈ యొక్క కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ పవన్,డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ రణధీర్, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యాధికారులు,మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్,కార్యాలయ సిబ్బంది డెమో తిరుపతయ్య,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.