జిల్లా కోర్టు సుమదాయం ను గద్వాల జిల్లా కేంద్రం లోని పీజేపీ క్యాంపు లోనే నిర్మించాలి

Jun 8, 2026 - 18:35
 0  0
జిల్లా కోర్టు సుమదాయం ను గద్వాల జిల్లా కేంద్రం లోని పీజేపీ క్యాంపు లోనే నిర్మించాలి

బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

 జోగులాంబ గద్వాల 8 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : : గద్వాల. జిల్లా కోర్టు సముదాయం జిల్లా కేంద్రంలోని నిర్మించాలని జిల్లా న్యాయవాదులు సోమవారం గద్వాల జిల్లా కేంద్రం లోని కోర్టు ప్రాంగణంలో చేపట్టిన నిరసన ధర్నా కార్యక్రమం నకు హాజరై బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నడిగడ్డ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకుంటూ ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించడం సిగ్గు చేటు అని అన్నారు.

ప్రజలకు అనువైనా ప్రాంతం జిల్లా కేంద్రంలోని బిజెపి క్యాంపు కార్యాలయ.  అక్కడ నిర్మించకుండగా జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో అనంతపురం గుట్టలలో కోర్టు నిర్మిస్తే, వచ్చే కక్షిదారులకు ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అక్కడ ప్రజలు జిల్లా కేంద్రం వచ్చి జిల్లా కేంద్రం నుంచి మళ్లీ పది కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. దీనివల్ల కోర్టు కు వచ్చే కాక్షిదారులు గాని సాక్ష్యం చెప్పడానికి వచ్చే వారికీ తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది అని అన్నారు.

 2024 లో డిసెంబర్లో న్యాయవాదులు నిరసన దీక్ష చేసే సమయంలో అధికార పార్టీ నాయకులు కోర్టు ను గద్వాల జిల్లా కేంద్రంలోని నిర్మించే విధంగా కృషి చేస్తామని చెప్పి నిరసనను విరమించినటువంటి నాయకులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు..?
ఎవరి స్వలాభం కోసం అనంతపురం గుట్టల్లో కోర్టు ను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కచ్చితంగా దీన్ని విరమించుకోవాలి లేని పక్షంలో ప్రజా పోరాటాలు కచ్చితంగా రోడ్ల మీదకు వస్తాయి. ప్రజాలకు వ్యతిరేకంగా పోయేటువంటి ప్రభుత్వం ను, నాయకులను నడిగడ్డ ప్రాంత ప్రజలు కచ్చితంగా గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్, టిఫిఏఫ్ నాయకులు శంకర ప్రభాకర్, పాలమూరు అధ్యయన వేదిక ఇక్బాల్ బాషా, అబ్దుల్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333