జాతీయ మార్కెట్ యార్డ్ లోని డైలీ వేజ్ వర్కర్లకు జీతాలు ఇవ్వండి

Jun 8, 2026 - 18:34
 0  0
జాతీయ మార్కెట్ యార్డ్ లోని డైలీ వేజ్ వర్కర్లకు జీతాలు ఇవ్వండి
జాతీయ మార్కెట్ యార్డ్ లోని డైలీ వేజ్ వర్కర్లకు జీతాలు ఇవ్వండి

జోగులాంబ గద్వాల 8 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డులో పనిచేసే డెలివేజ్ వర్కర్లకు జీతాలు ఇవ్వాలని రోజువారి కూలీలు వెంకటమ్మ. జాంగిరు. గోకారి తదితరులు తెలిపారు. చాలా చలక జీతాలతో పని చేస్తున్నామని రోజువారి కూలీ గా ఉన్న డబ్బులు చెల్లించడంలో అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తపరిచారు.11 నెలల నుంచి జీతాలు అందక చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య లే శరణమని అధికారులను వేడుకుంటున్నారు. గద్వాల్ లోని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఎన్నో సంవత్సరాలనుంచి పనిచేస్తున్న అడ పా దడప సొమ్ము చేతికి వచ్చేవని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దినసరి కూలీల బతుకులు ఆగమైనట్లు వారు ఆవేదన వ్యక్తపరిచారు. దినసరి కూలీలుగా పనిచేస్తున్న మాకు సక్రమంగా డబ్బులు ఇవ్వకుండా సొమ్ము రాక కుటుంబాలు గడుపుకునేందుకు అవస్థలు పడుతున్నామని వారు తెలిపారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని అధికారులను అడుగుతే బిల్లును పంపించినాము రాలేదని చేతులెత్తేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8 గంటలకు వచ్చి సాయంత్రం దాకా మార్కెట్ యార్డ్ లో పనిచేసి వివిధ రకాల పనుల్లో నిమగ్నమై దుమ్ముతో శ్వాస రోగాలు వ్యాపించిన పని చేస్తున్నామని వారు తెలిపారు. వీధి నిర్వహణలో బాధ్యతగా పనిచేసిన మమ్ములను పట్టించుకోకపోవడం బాధాకరమైనదని వారు అన్నారు. మా బతుకులు ఆగం గాక మునుపే ప్రభుత్వం ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని అందరిలాగా మాక్కూడా నెల జీతాలు ఖాతాలో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పెండింగ్ లో ఉన్న దినసరి జీతం మొత్తం సొమ్మును విడుదల చేయాలని వారు కోరారు. మార్కెట్ యార్డ్ లోని 9 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు వారందరికీ ఇప్పటివరకు ఒక పైస కూడా ఇవ్వలేదని వారు తెలిపారు. నెలసరి దిన కూలి లాగా పదివేల 870 రూపాయలు గతంలో ఇచ్చేవారని ఇప్పటివరకు ప్రభుత్వం సొమ్ము విడుదల చేయకపోవడంతో వెంటనే 11 నెలల సొమ్మును విడుదల చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
దినసరి కూలి వెంకటమ్మ మాట్లాడుతూ....
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు నుంచి 11 నెలలు డే లి వే జ్ వర్కర్లకు జీతాలు లేక కుటుంబాలు పస్తులు ఉంటున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నత అధికారులు స్పందించి వెంటనే సొమ్ము రిలీజ్ చేయాలని దినసరి కూలీలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333