అభిమానుల మధ్య ఘనంగా 14వ వార్డ్ కౌన్సిలర్ గాలి సాయి జన్మదిన వేడుకలు
కొత్త బస్టాండ్ అండర్ పాస్ వద్ద తన అభిమానులు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు
సూర్యాపేట, 25 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా కేంద్రం.. తన అభిమానుల మధ్య ఘనంగా జన్మదిన జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నదని 14వ వార్డు కౌన్సిలర్ గాలి సాయికిరణ్ అన్నారు. శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ కింద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం గొప్ప పుణ్యకార్యమని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.