ప్రజా సమస్యలపై ఈ నెల 30న కలెక్టరేట్ ముందు జరుగు ధర్నా జయప్రదం చేయండి....
సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపు...
సూర్యపేట, 25 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 30వ తేదీన సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు ఎం.వి.ఎన్ భవన్లో జరిగిన ప్రజాసంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి పథకంగా మార్చి పేదల పొట్ట కొడుతుందని అన్నారు. ఉపాధి చట్టాన్ని విబిజీ రామ్ జీ బిల్లుగా మార్చి నిధుల్లో కోత పెడుతూ పేదలకు ఉపాధి లేకుండా చేస్తుందన్నారు. విద్యుత్ సవరణ చట్టం తీసుకువచ్చి రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేస్తుందన్నారు.
కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను తొలగించి లేబర్ కోడ్ ల ద్వారా వారి హక్కులను కొల్లగొడుతుందన్నారు. కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకుండా వాళ్లతో వెట్టి చాకిరి చేయించుకోవడం కోసమే లేబర్ కోడెలను తీసుకొచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వి బి జి రామ్ జి బిల్లు రద్దుచేసి ఉపాధి హామీ చట్టాన్ని కి అధిక నిధులు కేటాయించి యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని రంగాలకు సమ ప్రాధాన్యత కల్పించలేదన్నారు. పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఆర్ గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించి వాటికి బడ్జెట్లో తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. రైతాంగానికి పెట్టుబడి కోసం వ్యవసాయం ప్రారంభ సీజన్లో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు ఇవ్వడంలో జాప్యం చేసి ప్రకటించిన తర్వాత కూడా అందరికీ సక్రమంగా అందజేయడం లేదన్నారు.
రాష్ట్రంలో రాజకీయాల పేరుతో అధికార ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయే తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం లేదన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కోసం సిపిఎం పార్టీ అనేక పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యం చేసి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా అనేక ఉద్యమాలు పాదయాత్రలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగానే ఈనెల 30వ తేదీన సూర్యాపేట జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే భారీ ధర్నాలో సమస్యలతో బాధపడే ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొలిశెట్టి యాదగిరిరావు కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న టిపిటిఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షులు జే నరసింహారావు జిఎంపిఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు వీరబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.