జాతీయ 4వ మహాసభలను జయప్రదం చేయండి
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ 28 29 30తేదీ లలో ఖమ్మం జిల్లాలో జరగబోయే అఖిలభారత రైతు కూలి సంఘం ఏఐకేఎంఎస్ జాతీయ 4వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ.ఏపూరు గ్రామంలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అరుణోదయ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ కాంచనపల్లి సైదులు AIKMS జిల్లా నాయకులు కామ్రేడ్ అహ్మద్ హుస్సేన్ (జిలేరు) మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కూలీల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వాణిజ్య ఒప్పందాన్ని వెనక్కు తీసుకోవాలని రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని బిజెపి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీ వి రాంజీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్లతో ఖమ్మంలో జరగబోయే భారీ ర్యాలీ బహిరంగ సభకు రైతు కూలీలు శ్రామిక ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కామ్రేడ్ బత్తిని ఎల్లయ్య సుదగాని రవి గోపాల్ ,బోలక బిక్షం సుదగాని వెంకన్న ,ముఖేష్, లింగయ్య షేక్ ఇబ్రహీం మల్సూర్ అలీ వీరబోయిన మహేష్ సాయనబోయిన మల్లయ్య బండి సైదులు వీరబోయిన వెంకన్న ఆవిరె మల్లయ్య కాంతయ్య సుదగాని లక్ష్మయ్య చిత్తలూరు వెంకన్న ధర్మపురి రాములు, సైదులు మల్లయ్య