జర్నలిస్టులకు ముఖ్యమంత్రి చే నివాస స్థలాల పంపిణీ.

Sep 7, 2024 - 21:53
 0  58
జర్నలిస్టులకు ముఖ్యమంత్రి చే నివాస స్థలాల పంపిణీ.

ఆదివారం నాడు (8 .9 .2024 ) జర్నలిస్టులకు ముఖ్యమంత్రిచే నివాస స్థలాల పంపిణి

తెలంగాణ వార్త సూర్యపేట జిల్లా ప్రతినిధి.

*38 ఎకరాల భూమి అందచేయనున్న సి.ఎం*. 

*మరణించిన 36 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ లక్ష అందచేత*

     హైదరాబాద్, సెప్టెంబర్ 7 :: సుదీర్ఘకాలంగా జర్నలిస్టులు తమ నివాస స్థలాలకై ఎదురుచూస్తున్న శుభ ముహూర్తం ఖరారైంది. రేపు (8 . 9 .2024 ) న ఉదయం 10 హైదరాబాద్ రవీంద్ర భారతి లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై జవహర్ లాల్ నెహ్రు హోసింగ్ సొసైటీ కి 38 ఎకరాల భూమిని అందచేయనున్నారు. *ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమం* అనే పేరుతొ నిర్వహిస్తున్న ఈ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమానికి రాష్ట్ర సమాచార పౌరసంబందాలు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస రెడ్డి లతో పాటు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, స్థానిక పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. 

        రాష్ట్రంలో విధినిర్వహణలో, వివిధ కారణాల వల్ల మరణించిన 36 మంది జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా ఈ సమావేశంలో అందించనున్నారు.

        రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొనే ఈ సమావేశానికి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా జర్నలిస్టులను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ఎం. హనుమంత రావు విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని సమాచార శాఖ తరపున లైవ్ కవరేజి ఇస్తున్నందున ప్రెస్ ఫోటో, వీడియో గ్రాఫ్ చేయడానికి అనుమతించడంలేదని, ఇందుకు సహకరించాల్సిందిగా తెలిపారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223