జర్నలిస్టుల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న యూనియన్ TUWJ (IJU)
*ఇంటి స్థలాలు... అక్రిడిటేషన్లు...హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి*
తెలంగాణ వార్త సూర్యాపేట జిల్లా ప్రతినిధి
*జర్నలిస్టుల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న యూనియన్ టియుడబ్ల్యూజే(ఐజేయు)*
*సూర్యాపేట*
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన ఇంటి స్థలాలు అక్రిడిటేషన్లు హెల్త్ కార్డుల విషయంలో ప్రత్యేక దృష్టిసారించిన టీయూడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టుల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుందని టి యు డబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రాం నారాయణ చెప్పారు. ప్టెంబర్ ఒకటవ తారీఖున సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే టి యు డబ్ల్యూ ఐ జె యూ రాష్ట్ర కార్యవర్గ సమావేశ ఏర్పాట్లను పర్యవేక్షించిన సందర్భంగా మాట్లాడారు. దేశంలో
70 శాతం పైగా జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమ యూనియన్ దేశంలో 25 రాష్ట్రాల్లో నిర్మాణాత్మక సంఘంగా పటిష్టంగా ఉందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు 1957వ సంవత్సరం నుంచి చేస్తున్న ఘనమైన చరిత్ర తమ యూనియన్ కు ఉందన్నారు. జర్నలిస్టుల పక్షాన సమరశీల పోరాటాలు నిర్వహించి పోరాడటంలో, అనేక సమస్యలు పరిష్కరించడంలో ముందున్నామని స్పష్టం చేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలను గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు విన్నవించుకున్నా పరిష్కారం కాలేదని, సమస్యల్ని పరిష్కరించడంలో గత పాలకులు శ్రద్ధ చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ ఒకటో తారీఖున జరిగే యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కొరకు ఒక విధి విధానాలు రూపొందించి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి సమస్యల పరిష్కారం కొరకు ముందుకు తీసుకెళ్తామని వివరించారు. జర్నలిస్టుల సమస్యలైన ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు , అక్రిడిటేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వాటిని పరిష్కరించే దిశగా ఈ కార్యవర్గ సమావేశంలో చర్చకు తీసుకొస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ 1న జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఐజేయు జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి తోపాటు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, ఐ జే యు జాతీయ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యులు కే సత్యనారాయణ, మాజీ అధ్యక్షులు నగునూరి శేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు, ప్రెస్ కౌన్సిల్ మాజీ సభ్యులు మాజీద్, తదితరులు హాజరవుతారని వివరించారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశ ఏర్పాట్లు సూర్యాపేట జిల్లా కమిటీ విస్తృతంగా చేస్తున్నారని, వారిని అభినందిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా సూర్యాపేటకు విచ్చేసిన రామ్ నారాయణ ను జిల్లా కమిటీ పక్షాన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే ఐజేయు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు బత్తుల మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి రెబ్బ విజయకుమార్, జిల్లా ప్రెస్ క్లబ్ కోశాధికారి తల్లాడ చందన్, సీనియర్ జర్నలిస్టులు పులుసు నాగరాజు, గుడిపూడి రామకృష్ణ, శ్యామ్ గౌడ్, నరేందర్, బిగ్ టీవీ రామకృష్ణ, నాగరాజు, వెంకటేష్ తండు, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.