జములమ్మ దేవాలయ పరిసరాలలో హలాల్ నిషేధించి జట్కా పద్ధతి ప్రవేశపెట్టాలి : విశ్వహిందూ పరిషత్ – బజరంగ్ దళ్

Jun 9, 2026 - 15:10
 0  3
జములమ్మ దేవాలయ పరిసరాలలో హలాల్ నిషేధించి జట్కా పద్ధతి ప్రవేశపెట్టాలి : విశ్వహిందూ పరిషత్ – బజరంగ్ దళ్
జములమ్మ దేవాలయ పరిసరాలలో హలాల్ నిషేధించి జట్కా పద్ధతి ప్రవేశపెట్టాలి : విశ్వహిందూ పరిషత్ – బజరంగ్ దళ్

జోగులాంబ గద్వాల 9జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని శ్రీ జములమ్మ దేవాలయంలో జంతు బలుల విషయంలో హలాల్ విధానాన్ని నిషేధించి, సంప్రదాయ జట్కా పద్ధతిని అమలు చేయాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు మంగళవారం దేవాలయ ఈవో పురేందర్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రామదేవతల ఆరాధనలో భాగంగా అనాదిగా కొనసాగుతున్న హిందూ సంప్రదాయాలను పరిరక్షించడం అవసరమని పేర్కొన్నారు. జములమ్మ అమ్మవారి ఆలయ పరిధిలో జరిగే జంతు బలులు హిందూ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా సంప్రదాయ జట్కా పద్ధతిలోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే భక్తుల మనోభావాలు, దేవాలయ సంప్రదాయాలు మరియు స్థానిక ఆచారాలను గౌరవిస్తూ ఆలయ పరిసరాలలో హలాల్ విధానాన్ని అనుమతించకుండా తగిన చర్యలు చేపట్టాలని ఈవోకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి సి. ప్రవీణ్ కుమార్, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ తిరుపతి మణి, కౌన్సిలర్ చంద్రశేఖర్, గాడ్సే మోహన్, వెంకటేష్,మనోజ్, శ్రీకాంత్, తిరుమలెష్ ,భాస్కర్, రాజు, పవన్ తదితర విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333