చెట్లు నాటండి పర్యావరణాన్ని కాపాడండి డాక్టర్ మల్లెల వందన
తిరుమలగిరి 05 జూన్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
ప్రపంచం పర్యావరణ డే ను పురస్కరించుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తిరుమలగిరి యందు అవగాహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డాక్టర్ మల్లెల వందన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ప్రతీ సంవత్సరం మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ వ్యర్థాలు వాడకూడదని సూచించారు. మానవ జీవికి జంతు జీవలకు చెట్లు ఎంతో ఉపయోగకరమని,మానవ మనుగడకు మూలాధారమైన చెట్లను కాపాడుకోవాలని కోరారు.పక్షులకు,జంతు జీవవలకు జీవనాధారమైన చెట్లను పెంచాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో CHO మాలోతు బిచ్చునాయక్ పాల్గొన్నారు.