ఘనంగా ఎమ్మెల్యే మందుల సామేలు జన్మదిన వేడుకలు

Jul 14, 2026 - 21:35
Jul 14, 2026 - 22:21
 0  4
ఘనంగా ఎమ్మెల్యే మందుల సామేలు జన్మదిన వేడుకలు

ప్రజా పాలనలో అభివృద్ధి సాధ్యం.

రాష్ట్రంలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలబెడతా.

ఇంటిగ్రేటెడ్ స్కూల్, జూనియర్ కాలేజ్.

సిసి రోడ్ డ్రైనేజీ పలు అభివృద్ధి కార్యక్రమం.

తిరుమలగిరి మండలానికి 650 కోట్లు నిధులు.

కొత్త పాత అనేది ఏమీ లేదు అందరూ కలిసిమెలిసి ఉండాలి.

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా.. 

తిరుమలగిరి 15 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, జనహృదయ నేత మందుల సామేలు జన్మదిన వేడుకలు తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ఘనంగా జరిగాయి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్ధన్ ఆధ్వర్యంలో స్థానిక పూలే చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో నియోజకవర్గ నలుమూలల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేలు అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానుల మధ్య పుట్టినరోజు జరుపుకున్నారు. నాయకులు గజమాలతో ఎమ్మెల్యే సామేలు ను సత్కరించారు.  రాష్ట్రంలో 'ప్రజా పాలన' ద్వారా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ సమృద్ధిగా అందుతున్నాయని చెప్పారు. అలాగే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ ప్రజా కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని, పార్టీ బలంగా ఉంటేనే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ​నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్ల నిధులతో ​తుంగతుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలబెట్టడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తిరుమలగిరి మండల కేంద్రంలో రూ. 200 కోట్లతో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం.తిరుమలగిరి ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ నూతనంగా 'జూనియర్ కళాశాల' ఏర్పాటు చేసామని, త్వరలో ఐదు కోట్లతో కళాశాల నూతన భవన నిర్మాణం జరగబోతుందని, దాదాపుగా తిరుమలగిరి మండల మరియు మున్సిపాలిటీలో 600 కోట్ల నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామన్నారు. గెలిచిన నాటి నుండి నేటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా వందల,వేల కోట్ల రూపాయల నిధులతో మౌలిక వసతుల కల్పనకు ఏర్పాటు చేశామన్నారు.​ఈ ప్రగతి ప్రస్థానంలో జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిల సహకారం మరువలేనిదని, వారి మద్దతుతో నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు.  పార్టీ కోసం రక్తం చెందించి కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ ప్రభుత్వం అక్కున చేర్చుకుంటుందని, వారందరికీ తగిన అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని 9 మండలాలకు కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ ఆమోదంతో సమర్థులైన నూతన అధ్యక్షులను నియమించడం జరిగిందని తెలిపారు.నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు చిన్న-పెద్ద, కొత్త-పాత అనే తేడాలు లేకుండా అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు.పార్టీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, నేనున్నా అనే ధైర్యంతో మీకు అండగా ఉంటా" అని కార్యకర్తలకు అభయమిచ్చారు.   24 గంటలూ ప్రజాక్షేత్రంలో ఉంటూ, ప్రజల సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేసి, ప్రతి గ్రామంలోనూ కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్ధన్, వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమ్మిలాల్, పట్టణ అధ్యక్షులు పేరాల వీరేష్, మార్కెట్ చైర్మన్ ఎల్సోజు చామంతి, నాయకులు కందుకూరి లక్ష్మయ్య, మూల అశోక్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాలెపు చంద్రశేఖర్, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు మరియు వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి