ఎల్పిజి గ్యాస్ ఫైర్ అయినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

Apr 16, 2026 - 21:56
Apr 16, 2026 - 21:58
 0  5
ఎల్పిజి గ్యాస్ ఫైర్ అయినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

తెలంగాణ వార్త కోదాడ, ఏప్రిల్ 16: అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా స్థానిక సిరి అపార్ట్మెంట్ నందు గ్యాస్ ఎల్పీజీ, గ్యాస్ ఫైర్ అయినప్పుడు ఏ విధంగా ఆర్పాలి అపార్ట్మెంట్ వాసులకు అగ్నిమాపక అధికారి డాక్టర్ కే బాబు ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా వంటగదిలో వంట గ్యాస్ లీక్ అయినప్పుడు దానిని ఎలా సేవ్ చేయాలి అనేది మహిళలు ముఖ్యంగా నేర్చుకోవాలని ఆయన అన్నారు. వంట గదిలో వంట చేస్తున్నప్పుడు గ్యాస్ లీకైతే వాసనను గమనించి తగిన చర్యలు తీసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది లీడింగ్ ఫైర్ ఫైటర్ ఎం శ్రీనివాసరావు గారు జి శ్రీనివాసరావు, ఫైర్ ఫైటర్ రవి, శ్రీనివాసు, మహిళలు, అపార్ట్మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333