గురుకుల కళాశాలలో ఉద్యోగాలు సాధించిన వారికి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం

Feb 26, 2024 - 18:02
 0  9
గురుకుల కళాశాలలో ఉద్యోగాలు సాధించిన వారికి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం
ఉద్యోగాలు సాధించిన శోభన్ బాబు కందగట్ల గీతను సన్మానిస్తున్న అంబేద్కర్ యూత్ సభ్యులు

మునగాల 26 ఫిబ్రవరి 2024 

తెలంగాణ వార్త ప్రతినిధి :-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటివల వెలువడించిన ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రంలో రెండో స్ధానంలోగురుకుల కళాశాల ఫిజికల్ డైరెక్టర్ గా జిల్లేపల్లి శోభన్ బాబు, గ్రంథాలయ అధికారిగా కదగంట్ల గీత ఉద్యోగం సాధించడం అభినందనీయం అని వికారాబాద్ జిల్లా బషిరాబాద్ మండల ఎంపిఓ మాతంగి రమేష్ అన్నారు.మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ‌ఇటివల వెలువడిన ఉద్యోగలో గురుకుల కళాశాల ఫిజికల్ డైరెక్టర్ గా జిల్లేపల్లి శోభన్ బాబు,గ్రాంథాలయ అధికారిగా కదగంట్ల గీత ను అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ ప్రధానోపాధ్యాయుడు రాము,సత్తార్, బాలరాజు, కరుణాకర్, కృష్ణవేణీ, జిల్లేపల్లి సుమన్, మాతంగి సైదులు, రైల్వే ఉద్యోగి లోడంగి నాగన్న, మాతంగి వెంకటేశ్వర్లు,కోట నాగరాజు, సోమపంగు గోపి,జిల్లేపల్లి లక్ష్మి నారాయణ,కోట మన్మధుడు, కోట సైదిబాబు, మచ్చ చంటి, జిల్లేపల్లి సైదమ్మ, పున్నమ్మ, అంబేద్కర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State