రాజీ మార్గమే రాజ మార్గం :ఎస్సై వెంకట్ రెడ్డి
తిరుమలగిరి 19 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:
ఈ నెల 20 న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తిరుమలగిరి ఎస్సై వెంకట్ రెడ్డి సూచించారు . శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయస్థానాల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతూ సమయం, ధనం వృథా చేసుకునే కంటే.. పరస్పర అంగీకారంతో సమస్యలను ముగించుకునే రాజీ మార్గమే కక్షిదారులకు నిజమైన రాజమార్గం. ప్రజలకు త్వరితగతిన, అత్యంత సులభంగా, తక్కువ ఖర్చుతో చట్టబద్ధమైన న్యాయం అందించడమే లక్ష్యంగా జూన్ 20న నిర్వహించనున్న ఈ ఏడాది రెండవ జాతీయ లోక్ అదాలత్ ను ప్రజలు, కక్షిదారులు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి” అని పిలుపునిచ్చారు.