విద్యాసంస్థలను తరచూ పర్యవేక్షించాలి: కలెక్టర్‌

Sep 7, 2026 - 19:57
 0  14
విద్యాసంస్థలను తరచూ పర్యవేక్షించాలి: కలెక్టర్‌

 జోగులాంబ గద్వాల 7 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల: జిల్లాలోని గురుకులాలు, వసతి గృహాలు, పాఠశాలలను ప్రత్యేక అధికారులు తరచూ సందర్శిస్తూ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా పర్యవేక్షించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ ఆదేశించారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ శాఖలు ప్రైవేట్‌ ఇంటర్నెట్‌కు బదులుగా టీ-ఫైబర్‌ సేవలను వినియోగించాలని, సెన్సస్‌ హ్యాండ్‌బుక్‌ కోసం గ్రామాల వారీగా సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. వినాయక చవితి, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333