గడసరి అమ్మాయిలు.. వయసైపోతున్న యువకులు..
తల్లడిల్లి పోతున్న తల్లిదండ్రులు..
కొడుకు కు ముప్ఫై ఏళ్ల లోపు పెళ్లి కాకుంటే ఆజన్మ బ్రహ్మా చారిగా ఉంటాడనే బెంగ తల్లి దండ్రులను పట్టి పీడిస్తుంది...ఎక్కడ చూసినా మహిళా జనాభా ఎక్కువైనా కూడా ముప్ఫై ఏళ్ల వరకు అమ్మాయిలు కూడా పెళ్లి ధ్యాస లేకుండా ఉద్యోగం వెలగ బెడుతుండంతో పురుషాధిక్యత సమాజంలో ఆడవాళ్ళ పెత్తనం పెరిగిపోయి 'పెళ్లి కాని ప్రసాదు' లు తాళి బొట్టు పట్టుకొని అమ్మాయి కోసం వెంపర్లాడం తో ఈ తరం అమ్మాయిలు చెట్టు ఎక్కి మరి పిల్లవాడి రేజ్యూం చూసి పెదవి విరవడంతో ఒక అమ్మాయికి పదిమంది నిష్పత్తి చొప్పున పెళ్లి చూపుల పరంపర కొనసాగుతూనే ఉంది!! అబ్బాయిలు బెండకాయ ముదిరినట్టు ముదిరి పోతున్న పెళ్లి జాడ లేక విలవిల లాడి పోతున్నారు...అమ్మాయిల డిమాండ్ కన్నా ఆమెను కన్న పేరెంట్స్ కోరికలు చాంతాడు అంత ఉండడంతో పెళ్ళి కొడుకులు క్యూ కడుతున్నారు...వాడికి పర్మినెంట్ జాబు ఉండాలి ఒక ఐదెకరాల పొలం ఉండాలి...హైదరాబాద్ లో కోటి రూపాయల అపార్ట్మెంట్ ఉండాలి...అమ్మాయి మెళ్ళో ఇరవై ఐదు తులాల బంగారం వేయాలి...పెద్ద వివాహ వేదిక లో వెయ్యి మందికి భోజనం పెట్టాలి... ఆన్న డిమాండ్ ముందు ఉంచడమే కాకుండా అమ్మాయి పెళ్లి అయ్యాకా కూడా జాబ్ చేస్తే ఆ అమ్మాయి సంపాదన తల్లి దండ్రులకు చెందాలి ఆన్న ప్రధాన డిమాండ్ల ను తలవోగ్గి పెళ్లి పీటల మీదకు అమ్మాయి వచ్చే వరకు వణుకుతూ పెళ్లి పనులు చేసే మగ పెళ్లి వారి బాధలు ఏ పగ వాడికి కూడా వద్దు! ఒక్క తెలుగు రాష్ట్రాల లోనే కాదు దేశం మొత్తం మీద అమ్మాయిల కోరికలు గుర్రాలు అయి పరిగెడుతుంటే భవిష్యత్ భారతంలో వివాహ వ్యవస్థ ఉంటుందా లేక 'సహాజీవన వ్యవస్థ' గా మారిపోతుందా అనే భయం విద్యాధికులు, సంప్రదాయ వాదులు పట్టుకుంది..
ఉద్యోగంతో అమ్మాయిలు..
కాలేజీ దాటగానే ఉద్యోగం ఆఫర్ రావడంతో ఇరవై ఐదేళ్ళకే అమ్మాయిలకు ముప్ఫై వేల ఉద్యోగం దొరకడం...మూడేళ్లలో అది రెట్టింపు కావడంతో సొంత కారు...కావాల్సిన కాస్మెటిక్స్...మాడ్రన్ దుస్తులతో కార్పోరేట్టు కల్చర్ లోకి వెళ్లి పోతున్న అమ్మాయిలు...పెళ్లి ధ్యాస మరిచి రంగుల ప్రపంచం లో విహరిస్తూ 'ఆడింది ఆట పాడింది పాట'గా జీవితం కొనసాగుతుంటే, పెళ్లి మీద ద్యాస ఎందుకుంటుంది?!...దానికి తోడు అమ్మాయిల కొలీగ్స్ లలో ఇద్దరో ముగ్గురో డైవర్స్ కేసులు ఉంటే వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడి, "పెళ్లి చేసుకొని వాడి చెప్పిన మాట వినే కన్నా సోలో లైఫ్ బెటర్" అనే అమ్మాయిల సైకాలజీ వల్ల పెళ్ళిళ్ళు అటు మొగవారికి ఇటు ఆడవారికి సరియైన వయసులో జరగపోవడం, దానికి తోడు అబ్బాయి 'మంచి వాడా చెద్దవాడ' అని తెలుసుకోవడానికి ఆర్నెళ్ళు 'సహజీవన యాత్రలు' చేసి రావడంతో మోజు తీరి మరో 'ఎర్నర్' కోసం వెతుకుతున్న ఈ తరం యువతుల వల్ల వివాహ వ్యవస్థ పెద్ద కుదుపునకు లోనవుతుంది..
'కులం చెడ్డ సుఖం దక్కాలనే' పెద్దల మాట పెడచెవిన పెట్టీ, రంగు రూపు చూసి వాడి బుట్టలో పడి రిజిష్టర్ మ్యారేజ్ చేసుకొని వాడు 'సకల కళా వల్లభుడు' అని తెలుసుకొని అమ్మ గారి ఇంటికి చేరుకుని లబోదిబోమంటే పోయిన మృదుత్వం వస్తుందా?! ఇలా ముప్ఫై ఏళ్లు గడిచాకా డబ్బున్న ఏజ్ బార్ వాడు దొరికితే వాడితో నైనా సరిగా సంసారం చేస్తుందా అంటే అదీ లేదు! పిల్లలు పుడితే అందం ఎక్కడ మసి బారుతుందో అని ముప్ఫై ఐదేళ్ల వరకు పిల్లలు కనకుండా టాబ్లెట్లు మింగే అమ్మాయిల అతి ప్రవర్తన వల్ల మనవలు - మనవరాళ్లు కావాలనుకునే పేరెంట్స్ ఆశలు అడియాశలు అయి పోతున్నాయి...2024 లో యువతుల 'పెళ్లి సందడి' ముప్ఫై ఏళ్ళు దాటుతుంది. అంటే అమ్మాయిల్లో పెళ్లి ద్యాస కన్నా సంపాదన ద్యాస ఎక్కువగా ఉందనే విషయం తేట తెల్లమవుతుంది...!
ఏ వయసులో ఆ వయసు ముచ్చట తీరాలని పెద్దలు ఊరికే అనలేదు...అది లేకే నేటి పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి...ఎంత మంచి ముహూర్తం పెట్టినా కూడా పెళ్ళిళ్ళు మూడు నాళ్ళ ముచ్చటగా కావడానికి ఆడపిల్లల తండ్రులు మొదటి కారణం కాగా 'పిల్లవాడు సెటిల్' కాలేదు...అని అబ్బాయి ఆదాయం పై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు రెండో కారణం! ముప్ఫై ఏళ్ల వరకు మహా అయితే అదా చేసుకుంటే యాభై లక్షలు ఉంటాయి కాబోలు 'కోటి' ఆశలు తల్లి దండ్రులు ఉంటే ఆ కోటి వచ్చేసరికి నెత్తి మీద జుట్టు ఊడి పోతూ లేక...చిక్కి శల్యమైన అబ్బాయిని ఏ పిల్ల పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంది?...ఆడపిల్లలు అందరూ మహేష్ బాబు లాంటి అబ్బాయి...ఆయనలా ఆడి కారు ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు.... కానీ అలాంటి వరుడు వేటలో ఉన్న ఎంపిక అయ్యే సరికి ఈడు పోయి అనాకారి దొరికితే వాళ్ళ ఆశలు అడి యాశలై పెళ్లయిన ఏడాదికే కోర్టు మెట్లు ఎక్కుతూ డైవర్స్ ఆట మొదలు పెడుతున్నారు!