కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Sep 4, 2024 - 17:24
Sep 4, 2024 - 17:25
 0  1
కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కిన్నెరసాని నదికి భారీగా వరదనీరు చేరడంతో లోతట్టు ప్రాంత ప్రజలను నిరంతరం అప్రమత్తం చేసే విధంగా పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పలు సూచనలు చేశారు.ఇందులో భాగంగా ఈరోజు ముందుగా రాజాపురం-యానాంబైలు గ్రామాల మధ్య నూతనంగా నిర్మితమవుతున్న బ్రిడ్జి వద్ద కిన్నెరసాని నది వరద ఉద్ధృతిని పరిశీలించి అధికారులకు మరియు స్థానికులకు ఉండాలని తెలిపారు.అనంతరం కిన్నెరసాని డ్యాం వద్ద ప్రస్తుత పరిస్థితిని అక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు.కిన్నెరసాని రిజర్వాయర్ గేట్లను తెరిచిన సమయంలో పర్యాటకులను ఎవ్వరినీ అనుమతించవద్దని డ్యామ్ అధికారులకు సూచించారు.భారివర్షాల కారణంగా ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు వారికి అందుబాటులో ఉండాలని అక్కడ ఉన్న అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,పాల్వంచ సీఐ వినయ్ కుమార్,పాల్వంచ రూరల్ ఎస్సై సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333