కాంగ్రెస్ పార్టీ పెంచిన వికలాంగుల పెన్షన్ 6 వేల రూపాయలు వెంటనే ఇవ్వాలి!
అంతోదయ రేషన్ కార్డు 35 కిలోల బియ్యం ఇవ్వాలి!
భువనగిరి 4 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి భువనగిరి మండలం రామకృష్ణ పురం గ్రామంలో సమావేశంలో పాల్గొని ఎన్ పి ఆర్ డి జిల్లా మహిళా కన్వీనర్ కొత్త లలిత మాట్లాడుతూ వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు 6వేల రూపాయలు పెన్షన్ పెంచి ఇస్తామని 100 రోజులలోపు వికలాంగునికి పెన్షన్ అందజేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఆ పెన్షన్ ఇవ్వడం లేదు వెంటనే అందజేయాలని ప్రతి వికలాంగునికి అంతోదయ రేషన్ కార్డు 35 కిలోల బియ్యం ఇవ్వాలని ప్రతి వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం వికలాంగులకు అందరికీ కల్పించాలని మహిళా వికలాంగులకు గ్రామాల ఇంటిదగ్గర కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రతి వికలాంగునికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రతి వికలాంగునికి అన్ని రకాల పరికరాలు అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామం కమిటీ ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులు సిలువేరు ఎల్లయ్య అధ్యక్షులు గడ్డం రాజశేఖర్ రెడ్డి ఉపాధ్యక్షులు చింతల వెంకటేశం కార్యదర్శి బల్లల బిక్షపతి సహాయక కార్యదర్శి సుబ్యారు భాగ్యమ్మ కోశాధికారి గోపి శరన్
ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి జిల్లా నాయకులు సిలివేరు ఎల్లయ్య, ఎస్ శంకర్ గోపే ,శంకర్ కే వరమ్మ బి ఆంజనేయులు,ఎస్ లావణ్య, ఎస్ మౌనిక, సిహెచ్ నవీను సిహెచ్ స్వామి ఎస్ బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.