ఐకెపి నిర్వాహకులపై సీరియస్
తిరుమలగిరి 02 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో తహసిల్దార్ కార్యాలయములో సమావేశం నిర్వహించటం జరిగినది ఈ సందర్భంగా తహసీల్దార్ హరిప్రసాద్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రములో రైతులు పండించిన ధాన్యం ను మాత్రమే కొనుగోలు చేయాలనీ రైతుల యొక్క పట్టాదార్ పాస్ పుస్తకం ఆధార్ బ్యాంకు అకౌంట్ వివరాలను సెంటర్ లో ధాన్యం పోసినప్పిడే సేకరించి రిజిస్టర్ లో రాయాలని కొనుగోలు కేంద్రములో పగటి పూట సెంటర్ నిర్వాహకులు ఉన్నపుడే ధాన్యం సెంటర్ లో పోసుకోవాలని మరియి షెడ్డు మంచినీటి సౌకర్యం ors పాకెట్లు అందుబాటులో ఉంచాలని రోజువారీ కొనుగోలు మరియు మిల్లు నుండీ ట్రకషీట్ ఆన్లైన్ లో నమోదు చేయాలనీ తెలిపినారు మరియు మార్కెట్ లేదా వ్యాపారుల నుండీ ధాన్యం కోనుగోలు చేసినట్లు అయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినము అనంతరం వవ సాయ మార్కెట్ సందర్శించి మార్కెట్ లో రోజువారీ కొనుగోళ్లు మరియు తరలించిన వివరాలు ప్రతిరోజు తెలుసుకొంటానికి మండల గర్ధవర్ లింగరాజులను రోజు వారి నివేదికలను తెచ్చుటకు ఆదేశించానైనది ఈ కార్యాల్రామములో మండల వ్యవసాయి అధికారి నాగేశ్వర్రావు గారు సీసీ నాగయ్య మెప్మా ndcms pacs ఐకేపీ అండ్ gpo లు నిర్వహకులు పాల్గొన్నారు